E-Paper
Advertisement

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మకు చోటు, టీమిండియా ఆడే మ్యాచ్ లు ఇవే

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మకు చోటు, టీమిండియా ఆడే మ్యాచ్ లు ఇవే

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు ( T20 World Cup 2026 ) సంబంధించిన షెడ్యూల్ తాజాగా రిలీజ్ అయింది. ముంబై వేదికగా భారీ ఈవెంట్ నిర్వహించి, టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ ( T20 World Cup 2026 Schedule) రిలీజ్ చేశారు. ఇండియా అలాగే శ్రీలంక రెండు దేశాలు ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇండియాతో పాటు శ్రీలంక రెండు దేశాల్లో మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

Also Read: T20 World Cup 2026 Schedule: టీ20 వ‌రల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్…4 గ్రూప్ లు, 20 జ‌ట్లు..పాకిస్తాన్‌, భార‌త్ మ్యాచ్ ఎప్పుడంటే

టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మకు ఛాన్స్

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో రోహిత్ శర్మకు ( Rohit Sharma) అరుదైన గౌరవం దక్కింది. అతనికి కూడా ఇందులో అవకాశం కల్పించారు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా రోహిత్ శర్మ ( ( Ambassador Rohit Sharma ) పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. 2011 వన్డే వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ గా ( Ambassador ) సచిన్ టెండుల్కర్ కు అవకాశం దక్కింది. ఆ సమయంలో టీమిండియా టైటిల్ గెలుచుకుంది. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కూడా టీ 20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం అయ్యాడు.

భారత్ ఆడే మ్యాచ్ ల షెడ్యూల్

టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు అట్టహాసంగా జరగనుంది. 30 రోజులపాటు జరగనున్న ఈవెంట్ నేపథ్యంలో టీమిండియా అలాగే పాకిస్తాన్ రెండు జట్లు కూడా ఒకే గ్రూపులో ఉన్నాయి. దీంతో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 15వ తేదీన కొలంబో వేదికగా మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 7వ తేదీన యుఎస్ఏ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య తొలి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబై వేదికగా నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల సమయంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది.

జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లో ప్రసారాలు రానున్నాయి. ఇక ఫిబ్రవరి 12వ తేదీన నామీబియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఢిల్లీ వేదిక మ్యాచ్ ఉండనుంది. పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15వ తేదీన కొలంబో వేదికగా ఉంటుంది. గ్రూప్ స్టేజిలో చివరగా నెదర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫిబ్రవరి 18వ తేదీన అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ ఉండనుంది. ఆ తర్వాత సూపర్ స్టేజి 8 మ్యాచ్ లు ఉంటాయి. ఫిబ్రవరి 21 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు సూపర్ 8, మార్చి 4, ఐదవ తేదీలలో సెమీఫైనల్స్ నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ మార్చి 8వ తేదీన ఉంటుంది.

Also Read:  Kabaddi World Cup 2025: కబడ్డీ ప్రపంచకప్ విజేతగా భారత్..2025లో 4 టైటిల్స్ ద‌క్కించుకున్న మ‌హిళ‌లు

 

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×