Ramcharan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది అంటే ఆ సినిమాని ఇతర భాషలలో కూడా రీమేక్ చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇప్పటికే ఇలా ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ సినిమాలు రీమేక్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ramcharan) మరో రీమేక్ సినిమాలో నటించబోతున్నట్లు ఇండస్ట్రీ సమాచారం. గత ఏడాది గుజరాతీ భాషలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లాలో(Lalo). కేవలం రూ. 50 లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 120 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
ఇలా గుజరాతి భాషలో తెరకెక్కి 100 కోట్ల క్లబ్ చేరిన మొట్టమొదటి సినిమాగా లాలో రికార్డు సొంతం చేసుకుంది అయితే ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయటానికి సన్న హాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేయటానికి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ రీమేక్ సినిమాలో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ (Ramcharan)నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్లు కాకుండా తమిళ డైరెక్టర్ పనిచేయబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.
కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju ) ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారని ఈయన తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా ఈ సినిమా కథను తీర్చిదిద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్న హాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ శ్రీ కృష్ణుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా రీమేక్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే ఈ వార్తలపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.
ఇక ఈ సినిమా అనుకున్న విధంగానే రీమేక్ అయినప్పటికీ ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో నటించబోయే సినిమా పనులలో బిజీగా ఉన్నారు .ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులను జరుపుకుంటుంది .త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాతనే లాలో రీమేక్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. రామ్ చరణ్ ఇటీవల పెద్ది సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.
Also Read: టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?