E-Paper
Advertisement

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?
Advertisement

Gautham Ghattamaneni: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు(Mahesh Babu) వారసుడిగా గౌతం ఘట్టమనేని(Gautham Ghattamaneni) అందరికీ ఎంతో సుపరిచితమే. గౌతమ్ విదేశాలలో ఉన్నత చదువులు చదువుతున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే గౌతం కూడా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఈయన బాల నటుడిగా మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో నటించారు. ఇక ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

టాక్సిక్ సినిమాకు గౌతమ్ రేటింగ్..

సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని గౌతమ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇటీవల కన్నడ స్టార్ హీరో యశ్(Yash) నటించిన టాక్సిక్ సినిమా(Toxic) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు ఈ సినిమా పట్ల వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గౌతమ్ సైతం టాక్సిక్ సినిమాకు రేటింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చలకు కారణమైంది. లెటర్ బాక్స్ డీ అనే ఖాతాలో గౌతమ్ పలు సినిమాలకు రేటింగ్ ఇచ్చారు. ఇందులో మహేష్ బాబు సినిమాలకు కూడా గౌతం రేటింగ్ ఇవ్వడం విశేషం.

మహేష్ బాబు సినిమాలకు దారుణమైన రేటింగ్..

Advertisement

ఇలా ఈ లెటర్ బాక్స్ డీ ఖాతాలో ఈయన హీరో యశ్ నటించిన టాక్సిక్ సినిమాకు దారుణంగా 0.5 రేటింగ్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఖాతా ద్వారా గౌతమ్ ఏకంగా 400 సినిమాలకు రివ్యూ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక మహేష్ బాబు సినిమాలలో భాగంగా పోకిరి సినిమాకు 5 రేటింగ్ ఇవ్వగా నిజం, వంశీ సినిమాలకు 2 రేటింగ్ ఇచ్చారు. ఇక బ్రహ్మోత్సవం సినిమాకు దారుణంగా 1 రేటింగ్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా సినిమాలకు గౌతమ్ ఇచ్చిన రివ్యూ చూసిన పలువురు విమర్శలు చేయగా మరి కొందరు మాత్రం గౌతమ్ రివ్యూ చాలా నిజాయితీగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

0.5 రేటింగ్ ఏంటీ భయ్యా…

ఏది ఏమైనా హీరో యష్ టాక్సిక్ సినిమాపై ఇప్పటికే ఎన్నో రకాల విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే గౌతమ్ ఘట్టమనేని ఈ సినిమాకు ఏకంగా 0.5 రేటింగ్ ఇవ్వటం మరిన్ని చర్చలకు కారణమైంది. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ సినిమా ఆగస్టు 26వ తేదీ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో విఫలమవ్వడమే కాకుండా ఈ సినిమాలో చాలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

Advertisement

Also Read: మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×