E-Paper
Advertisement

హమ్మయ్య.. పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ ఆ నష్టం భరించాల్సిందేనా?

హమ్మయ్య.. పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ ఆ నష్టం భరించాల్సిందేనా?
Advertisement

Peddi Movie: పెద్ది.. ప్రస్తుతం ఎక్కడ చూసినా అభిమానులు ఈ సినిమా కోసమే చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్(Ram Charan) హీరోగా , బుచ్చి బాబు సనా(Bucchibabu Sana) దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా వస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన చికిరి చికిరి , రై రై అంటూ వచ్చిన పాటలు ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా యూట్యూబ్లో సెన్సేషన్ సృష్టించాయి ఈ పాటలు. అంతేకాదు ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది. అంతేకాదండోయ్ ఈ సినిమా నుంచి విడుదలైన రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలిసారి బాడీ బిల్డర్ గా పహిల్వాన్ లుక్కులో చూసి అటు లేడీ అభిమానులు కూడా రామ్ చరణ్ లుక్ కి ఫిదా అయిపోయారు.

విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న పెద్ది..

ఇక విడుదలకు ముందే ఆడియన్స్ లో ఇన్ని అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా? ఎప్పుడెప్పుడు చూస్తామా? అని అభిమానులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నా.. చిత్ర బృందం మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూనే వచ్చింది. వాస్తవానికి రామ్ చరణ్ రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. అదే క్రేజీతో కోలీవుడ్ డైరెక్టర్ ఎస్ శంకర్ (S. Shankar) తో కలసి గేమ్ ఛేంజర్ సినిమా చేశారు. కానీ ఇది మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో థియేటర్లోకి వచ్చిన నెలలోపే ఈ సినిమాను థియేటర్ నుంచి తొలగించడం గమనార్హం. ఈ సినిమా తర్వాత ఎలాగైనా మంచి హిట్ కొట్టాలి అని ఎదురుచూస్తున్న రామ్ చరణ్ ఉప్పెన సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే టైటిల్ తో సినిమా ప్రకటించారు.

జూన్ 4 న పెద్ది.. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్..

Advertisement

స్పోర్ట్స్ డ్రామా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఈ ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత టికెట్ ధరల పెంపు కోసం అలాగే ఇంకా రెండు పాటలు షూటింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. కానీ సినిమా ఇంకా పర్ఫెక్ట్ గా రావడం కోసం అటు డైరెక్టర్, ఇటు ఏ ఆర్ రెహమాన్ సినిమాని కొంతకాలం వాయిదా వేయాలని చూసారు. అందులో భాగంగానే జూన్ 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే ప్రచారం గట్టిగా సాగింది. కానీ దీనిని రామ్ చరణ్ కొట్టివేశారు. కచ్చితంగా ఏప్రిల్ 30వ తేదీన వస్తుందని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను మళ్ళీ వాయిదా వేస్తున్నట్లు వార్తలు రాగా.. తాజాగా జూన్ 4వ తేదీన ఈ సినిమా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధం అయిపోయారు. అంతేకాదు త్వరలోనే ఈ అధికారిక డేట్ ని కూడా ప్రకటించబోతున్నారు. మొత్తానికైతే జూన్ 4వ తేదీన ఖచ్చితంగా సినిమాను విడుదల చేయబోతున్నారు అని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ALSO READ:హీరో విజయ్ కి బిగ్ షాక్.. ఓటెయ్యొద్దు అంటూ ధర్నా చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!

నష్టం భరించాల్సిందేనా?

Advertisement

ఇకపోతే జూన్ 4వ తేదీన విడుదల చేయడం బాగానే ఉన్నా జూన్ 12వ తేదీన ఎప్పటిలాగే స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అవుతాయి.మిగిలింది కేవలం ఎనిమిది రోజులు మాత్రమే అంటే వారం లోపల పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వస్తుందా? స్కూల్, కాలేజెస్ లు ఓపెన్ అయితే థియేటర్లకు ఆడియన్స్ రావడం తక్కువ అవుతుంది.. అలాంటి సమయంలో నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంటుంది. మరి సినిమా కథ బాగుంటే వారం రోజుల్లో అనుకున్న రేంజ్ లో కలెక్షన్లు రాబట్టడం సాధ్యమేనా? అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.. ఏది ఏమైనా జూన్ 4న రాబోతున్న ఈ సినిమా ఎలాంటి లాభాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×