E-Paper
Advertisement

Ram Charan : హీరోయిన్ల సామాన్ల వివాదంలోకి రామ్ చరణ్ సినిమాను లాగేసారుగా..!

Ram Charan : హీరోయిన్ల సామాన్ల వివాదంలోకి రామ్ చరణ్ సినిమాను లాగేసారుగా..!
Advertisement

Ram Charan : నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక పెద్ద చిచ్చు రాజేశాయి. ఈ వివాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ఒక పాట వైపు మళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాట దగ్గర ఆగి, కొత్త వాదనలకు తెరలేపింది.

అసలేం జరిగింది?
‘దండోరా’ ఈవెంట్ వేదికగా శివాజీ మాట్లాడుతూ.. హీరోయిన్లు వేసుకునే పొట్టి దుస్తులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందం అనేది నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్ప, సామాన్లు కనిపించేలా వేసుకుంటే ఉండదు అంటూ ఆయన వాడిన సామాన్లు , ముం**లు అనే పదాలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మహిళలను, హీరోయిన్లను కించపరిచారంటూ అనసూయ, చిన్మయి, మంచు లక్ష్మి, ఆర్జీవీ వంటి సెలబ్రిటీలు శివాజీపై నిప్పులు చెరిగారు.

Advertisement

సారీ చెప్పినా తగ్గని వేడి
వివాదం ముదరడంతో శివాజీ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. అయితే, ఆ సారీ కేవలం తాను వాడిన రెండు పదాలకేనని, తన సిద్ధాంతానికి మాత్రం కట్టుబడే ఉన్నానని రెండో రోజే ప్రకటించి షాక్ ఇచ్చారు. తాను చెప్పిన భావంలో తప్పేమీ లేదని ఆయన గట్టిగా సమర్థించుకోవడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది.

సీన్‌లోకి ‘పెద్ది’ పాట
ఈ వివాదంలో అనూహ్యంగా రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ చర్చల్లోకి వచ్చింది. శివాజీకి మద్దతు తెలుపుతున్న నెటిజన్లు, కరాటే కళ్యాణి వంటి వారు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను సంధిస్తున్నారు.శివాజీ సామాన్లు అంటే తప్పంటున్నారు కదా.. మరి ‘పెద్ది’ సినిమాలో ‘చికిరి చికిరి’ పాటలో వాడిన పదజాలం మీకు తప్పుగా అనిపించలేదా? అని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.శివాజీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు పాటల్లోని అశ్లీల పదాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో శివాజీ వర్సెస్ హీరోయిన్ల ఇష్యూ కాస్తా, ఇప్పుడు టాలీవుడ్ పాటల్లోని లిరిక్స్ చుట్టూ తిరుగుతోంది.

Advertisement

టాలీవుడ్ రెండుగా విభజన?
ప్రస్తుతం టాలీవుడ్ ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం హీరోయిన్లు ఏం వేసుకోవాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని, శివాజీ వాడిన భాష అభ్యంతరకరమని వాదిస్తోంది. శివాజీ చెప్పిన దానిలో నీతి ఉందని, కేవలం పదాలను పట్టుకుని విమర్శించడం సరికాదని, పెద్ద పెద్ద సినిమాల్లో అంతకంటే అశ్లీలత ఉందని మరో వర్గం కౌంటర్ ఇస్తోంది. మొత్తానికి శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక పెద్ద చర్చకే దారితీశాయి. మరి ఈ వివాదం ‘పెద్ది’ టీమ్ వరకు వెళ్తుందా? లేక ఇక్కడితో ఆగుతుందా? అనేది వేచి చూడాలి.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×