E-Paper
Advertisement

Saudi Deserts Snowfall: సౌదీ ఎడారులలో మంచు వర్షం.. భారత్ కు పెద్ద హెచ్చరికే!

Saudi Deserts Snowfall: సౌదీ ఎడారులలో మంచు వర్షం.. భారత్ కు పెద్ద హెచ్చరికే!
Advertisement

Saudi Deserts Snowfall:సౌదీ ఎడారుల్లో మంచు కురుస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. చూడడానికి ఈ దృశ్యాలు అందంగా ఉన్నా.. పర్యావరణ వేత్తలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులకు ఇది సంకేతంగా చెబుతున్నారు. పశ్చిమాసియా దేశాల్లో ఇటీవల వాతావరణంలో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. దుబాయ్ వరదలు, తాజాగా సౌదీ ఎడారిలో హిమపాతం వాతావరణ మార్పులను సూచిస్తుంది.

వేడెక్కుతున్న భూమి

గ్లోబల్ వార్మింగ్ వలన వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు. భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో.. వాతావరణం తేమశాతాలు మారుతున్నాయని అంటున్నారు. దీంతో చాలా ఏళ్ల పాటు స్థిరంగా ఉన్న వాతావరణ నమూనాలను ఇప్పుడు అస్థిరంగా మారుతున్నాయి. భారతదేశంతో సహా ప్రపంచం వ్యాప్తంగా తీవ్రమైన వేడి గాలులు, తీవ్రమైన వర్షపాతాలు, ఆకస్మిక చలి పరిస్థితులు ఎదురవుతున్నాయని పరిశోధకులు అంటున్నారు.

Advertisement

ఈ ఏడాది భారతదేశం వాతావరణంలో కూడా తీవ్రమైన మార్పులు జరిగాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారత్ లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలలో క్లౌడ్ బరస్ట్ సంభవించాయి. కొన్ని ప్రాంతాలలో ఆలస్యంగా, అస్థిరమైన రుతుపవనాల కారణంగా వరదలు సంభవించాయని పరిశోధకులు తెలిపారు.

భారత్ కు హెచ్చరికే

వాతావరణ మార్పులు భారత్ ఒక హెచ్చరిక లాంటిదని పరిశోధకులు అంటున్నారు. వ్యవసాయ విధానాలు, నీటి నిర్వహణ, పట్టణ ప్రణాళిక, విద్యుత్ డిమాండ్ అన్నీ కాలానుగుణంగా మారుతుండడంతో.. వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని పరిశోధకులు అంటున్నారు. ఇప్పటికే వాతావరణ సంక్షోభం మొదలైందని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read: FedEx H-1B Row: అమెరికా సిబ్బందిని తొలగించి.. H1b వర్కర్లకు ఉద్యోగాలిచ్చిన ఇండియన్ సీఈవో

అనూహ్య వాతావరణ మార్పులు

ఆగ్నేయాసియాలో ఎడతెరిపిలేని వరదలు లక్షలాది మందిని నిరాశ్రయులను చేశాయి. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు కరవు, కుండపోత వర్షాలు వ్యవసాయాన్ని కుంగదీస్తున్నాయి. దక్షిణ అమెరికాలో అసాధారణ ఉష్ణోగ్రతలు పర్యావరణ వ్యవస్థలను, విద్యుత్ సరఫరాను దెబ్బతీస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధిక జనాభా, మౌలిక సదుపాయాలు, వాతావరణ ఆధారిత జీవనోపాధి కలిగిన దేశాలు.. చిన్నపాటి వాతావరణ మార్పులు కూడా పెను సంక్షోభాలుగా మారవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×