E-Paper
Advertisement

Ram Charan: రామ్ చరణ్ గత 10 చిత్రాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. హైయెస్ట్ ఏది? పెద్ది సంగతేంటి?

Ram Charan: రామ్ చరణ్ గత 10 చిత్రాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. హైయెస్ట్ ఏది? పెద్ది సంగతేంటి?
Advertisement

Ram Charan:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచేశాయి. ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలతో పాటు రామ్ చరణ్ గత పది చిత్రాల కలెక్షన్స్ లిస్టు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రామ్ చరణ్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం..

ఇకపోతే పదుల సంఖ్యలో సినిమాలు చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రామ్ చరణ్.. తన గత పది చిత్రాలతో ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టారు? ఏ చిత్రానికి అత్యధిక కలెక్షన్స్ లభించాయి? ఇప్పుడు రాబోయే పెద్ది చిత్రం సంగతేంటి? అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం.. రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన చిత్రాలలో మగధీర, రంగస్థలం వంటి చిత్రాల పేర్లు ప్రధమంగా వినిపిస్తాయి. మగధీర సినిమా ప్రపంచవ్యాప్తంగా 146.8 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయగా.. రంగస్థలం ప్రపంచవ్యాప్తంగా 220.8 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది మొదటి స్థానంలో నిలిచింది.

టాప్ టెన్ లిస్ట్ ఇదే..

Advertisement

మిగతా చిత్రాల విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ చిత్రం 1291.2 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయగా ..ఆ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన గేమ్ చేంజర్ 215.8 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. నిజానికి ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా.. ఆర్ఆర్ఆర్ చిత్రం తీసుకొచ్చిన భారీ హైప్ కారణంగా ఈ సినిమాకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ లభించాయి. ఇక తర్వాత ఆచార్య 81.2 కోట్లు, వినయ విధేయ రామ 100.5 కోట్లు ధ్రువ 101.7 కోట్లు , ఎవడు 86.2 కోట్లు, నాయక్ 83.2 కోట్లు రచ్చ 82.8 కోట్ల కలెక్షన్స్ వసూలు చేశాయి.

ALSO READ:Tollywood: సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా సత్తా చాటుతున్న స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

పెద్దితో వెయ్యికోట్ల క్లబ్లో చేరుతారా?

Advertisement

ఇక ఇప్పుడు భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెద్ది కలెక్షన్స్ సంగతేంటి ? అనే విషయం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఇకపోతే ఈ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రామ్ చరణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం 1000 కోట్ల క్లబ్లో చేరడం గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్ కెరియర్ లోనే పెద్ది సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఏది ఏమైనా రాంచరణ్ గత పది చిత్రాల కలెక్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×