E-Paper
Advertisement

Ration Scam: ఆగని అక్రమ రేషన్ దందా.. తెలిసిన తెలియనట్టు నటిస్తున్నఅధికారులు

Ration Scam: ఆగని అక్రమ రేషన్ దందా.. తెలిసిన తెలియనట్టు నటిస్తున్నఅధికారులు
Advertisement

Ration Scam: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ ఆశయానికి అధికారులు తూట్లు
–ఇతర సరుకుల స్వీకరణను ప్రోత్సహిస్తున్న రేషన్​ డిలర్లు
–బయోమెట్రిక్​ పెడితే చాలు బియ్యం అమ్ముకోవచ్చు
–పట్టణ ప్రాంతాల్లో సన్న బియ్యం అక్రమమార్గం
–అధికారులకు తెలిసిన తెలియనట్లు వ్యవహారిస్తున్న వైనం
–ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇష్టారాజ్యం

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్చ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రేషన్​ బియ్యం పంపిణీ చేస్తుంది. ఈ రేషన్​ బియ్యం పక్కదారి పడుతున్నప్పటికి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్​ బియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకోని దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతి పేద, మద్య తరగతి కుటుంబాలు ఉచితంగా పంపిణీ చేసే రేషన్​ బియ్యం ఆసక్తిగా తీసుకుంటున్నారు. కానీ రేషన్​ డీలర్లు బియ్యం ఇవ్వకుండా ఇతర సరుకులను అంటకట్టేందుకు ప్రయాత్నం చేస్తున్నారు.ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని రేషన్​ డీలర్లు ఇదే తంతు నడిపిస్తున్నారు. అయితే లబ్ధిదారుల వద్ద బయోమెట్రిక్ తీసుకోని ఇతర సరుకులు ఇవ్వడం లేదా, నగదు ఇవ్వడంతో ఆరోపణలు లేకుండా డీలర్లు వ్యవహారిస్తున్నారు. ఆన్​లైన్​ నమోదుతో పంపిణీ చేయకుండా నిల్వ ఉన్న రేషన్​ బియ్యం రాత్రికి రాత్రి ఇతరులకు విక్రయిస్తూ అక్రమ మార్గాల ద్వారా బయటికి పంపిస్తున్నట్లు స్పష్టమైతుంది.

గోదుమలు,చక్కర పేరుతో అక్రమదందా..?

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం రేషన్​ బియ్యం పంపిణీతో రేషన్​ డీలర్లకు ఉపాధి పెద్దగా లేకపోవడంతో అదే షాపులో ఇతర నిత్యావసర సరుకులైన గోదమలు, చక్కర, నూనే, ఉప్పు, పప్పు, సబ్బు, సరుపు ఇలా విక్రయాలు చేసుకోవచ్చు అని సూచించింది. అయితే తప్పనిసరిగా బియ్యంతో పాటే విక్రయించుకోవాలని సివిల్​ సప్లయ్​ శాఖాధికారులు సూచిస్తే.. ఆ మాటను ఆసరాగా చేసుకోని బియ్యం ఇవ్వకుండా ఇతర సరుకులను లబ్ధిదారులకు అంటగడుతున్నారు. బియ్యం కేజీకి రూ.10ల నుంచి రూ.13ల వరకు లెక్కిస్తూ లబ్ధిదారుడికి పంపిణీ చేసే బియ్యం మొత్తం ధరకు ఏ వస్తువులు వస్తాయో అవి అప్పగించడం డిలర్ల తంతుగా నడుస్తుంది. ఆవిధంగా డిలర్లు దాచుకున్న బియ్యాన్ని బహిరంగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు రేషన్​ ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని నిరాకరిస్తున్నట్లు డిలర్లు వక్రికరిస్తూ గోదుమలు, చక్కర వస్తువులను అధికంగా వినియోగిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే కిరాణం షాపుల్లో దోరికే వస్తువులను రేషన్​ షాపుల్లో విక్రయించడం దారుణం. ప్రభుత్వం ఎంతో వెచ్చించి కొనుగోలు చేస్తున్న రేషన్​ బియ్యం అక్రమంగా విక్రయించడం రేషన్ షాపు యాజమాన్యుల దందాగా మారిపోయింది.

Also Read: Kishan Reddy: ఆర్ఎస్ఎస్ సంస్థలే కాంగ్రెస్ టార్గెట్: కిషన్ రెడ్డి

ప్రతి నెల 60శాతం అక్రమార్కుల చేతిలోకే..

Advertisement

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రైతులు, పేదల కోసమే సంక్షమ కార్యక్రమాలు చేపడుతుంది. రైతులు పండించే పంటలను సివిల్ సప్లయ్​ కార్పోరేషన్​ కొనుగోలు చేస్తే… పేదలకు, పేద విద్యార్ధులు చదువుకునే సంక్షేమ వసతిగృహాలకు పంపిణీ చేసే సన్న బియ్యం సివిల్​ సప్లయ్​ శాఖలే. ఈ రెండు శాఖలు అత్యంత క్రీయశీలకంగా పనిచేయాల్సిన అవసరం, బాధ్యత అధికారులపై ఉంది. కానీ రేషన్​ డీలర్లతో అధికారులు కుమ్మక్కైనట్లు ప్రచారం సాగుతుంది. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు పనిచేయడం లేదని తెలుస్తోంది.

జిల్లాలో రేషన్​ కార్డుల వివరాలు ఇలా..

రంగారెడ్డి జిల్లాలో 936 రేషన్‌షాపులు ఉన్నాయి. పట్టణ ప్రాంతంలో 218, గ్రామీణ ప్రాంతంలో 718 ఉన్నాయి. మొత్తం రేషన్‌కార్డులు 5,58,410 ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 3,50,123, పట్టణ ప్రాంతంలో 2,08,287 ఉన్నాయి. 18,22532 యూనిట్లు, బియ్యం 11559.197 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేస్తున్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 5,28,881 రేషన్‌కార్డులు ఉండగా 618 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. ఈ ఏడాది లో రేషన్‌ దుకాణాలకు 11,340 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. వికారాబాద్​ జిల్లాలో కొత్తగా మంజూరైన రేషన్‌ కార్డులతోపాటు కొత్తగా చేరిన సభ్యులతో జిల్లాలో రేషన్‌కార్డుల సంఖ్య 2,48,475కు చేరగా, 8,87,912 మంది లబ్ధిదారులకు 5,960 మెట్రిక్​ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు.

Also Read: Paidi Rakesh Reddy: ఏపీ కూటమి గూటమి మాకొద్దు.. ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఫైర్..!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×