E-Paper
Advertisement

Chikiri Chikiri Song Record: రిలీజ్ కి ముందే పెద్ది రికార్డు.. 100 మిలియన్లు దాటేసిన చికిరి

Chikiri Chikiri Song Record: రిలీజ్ కి ముందే పెద్ది రికార్డు.. 100 మిలియన్లు దాటేసిన చికిరి
Advertisement

Chikiri Chikiri Song Cross 100 Million: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులలో సుకుమార్ ఒకరు. సుకుమార్ ప్రత్యేకత ఏంటంటే అతని దగ్గర పని చేసిన ఎక్కువమంది దర్శకులుగా మారుతున్నారు. పెద్ద దర్శకులుగా పేరు తెచ్చుకున్న చాలామంది శిష్యులు దర్శకులు అయినట్లు పెద్దగా దాఖలాలు లేవు. కానీ సుకుమార్ శిష్యులు మాత్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం మొదలుపెట్టారు.

చరణ్-బుచ్చి కాంబో

సుకుమార్ శిష్యుడుగా ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బుచ్చిబాబు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. మొదటి సినిమా వైష్ణవ తేజ్ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పటికీ కూడా వైష్ణవకు ఆ స్థాయి సక్సెస్ మళ్లీ పడలేదు. ప్రస్తుతం బుచ్చిబాబు రామ్ చరణ్ తేజ్ తో పెద్ది అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 2026 26వ తారీఖున విడుదల కానుంది. ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ రీసెంట్ గానే విడుదల చేశారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

100 మిలియన్ల చికిరి

Advertisement

కొమరం పులి సినిమా తర్వాత ఇప్పటివరకు ఏఆర్ రహమాన్ తెలుగులో ఒక సినిమా కూడా చేయలేదు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేయాలి అంటే ఖచ్చితంగా కథ నచ్చాలి. అప్పుడే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఇకపోతే పెద్ది కథ విపరీతంగా నచ్చడంతో ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఈ సినిమా నుంచి చికిరి అనే పాట విడుదలైంది. ఈ పాట వచ్చినప్పుడు మొదటి చాలామంది కామెంట్ చేశారు.
కానీ ఇప్పుడు ఈ పాట ఒక సెన్సేషన్ అయిపోయింది. దాదాపు 100 మిలియన్స్ పైగా వ్యూస్ సంపాదించుకొని ఈ పాట రికార్డ్ క్రియేట్ చేసింది. మీసాల పిల్ల పాట కంటే కూడా హైయెస్ట్ వీస్ ఈ పాటకే వచ్చాయి.

Also Read: IBomma Ravi: రవి కస్టడీ ముగిసింది.. రేపు కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ విచారణ.. లాయర్‌ కామెంట్స్‌

సైలెంట్ గానే సంచలనం

Advertisement

బుచ్చిబాబు చూడడానికి చాలా అమాయకుడిగా చేతులు కట్టుకొని కనిపిస్తూ ఉంటాడు. పెద్దగా ఏమీ మాట్లాడడు. అలానే పెద్ది సినిమా పన్నులను కూడా సైలెంట్ గా చకాచకా చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ షాట్ వీడియో విడుదలైన విషయం తెలిసిందే. ఈ వీడియోకు కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సాంగ్ కు కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాతో కూడా అదే రేంజ్ సక్సెస్ కొడతాడు అని చాలామంది బలంగా నమ్ముతున్నారు. ఇకపోతే చికిరి స్టెప్ చాలామంది సెలబ్రిటీలు కూడా రీ క్రియేట్ చేయడం విశేషం. మొదటి పాటతోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి జనాల్లోకి సినిమాను ఇంకా లోతుగా తీసుకెళ్లిపోయాడు బుచ్చిబాబు. ఇంక ముందు ముందు రాబోయే కంటెంట్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×