E-Paper
Advertisement

APK Files: వాట్సాప్‌లో APK ఫైల్స్‌తో మిమ్మల్ని ఎలా దోచేస్తారో తెలుసా? ఈ వీడియో చూస్తే షాకే!

APK Files: వాట్సాప్‌లో APK ఫైల్స్‌తో మిమ్మల్ని ఎలా దోచేస్తారో తెలుసా? ఈ వీడియో చూస్తే షాకే!
Advertisement

రోజురోజుకీ సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు అందరినీ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ ద్వారా వాట్సప్ గ్రూపుల్లో మెసేజులు పంపడం.. బ్యాంకుల పేర్లతో అలర్ట్ మెసేజులు పంపడం, ఆధార్ అప్డేట్ అంటూ ఫేక్ మెసేజులు పంపడం వంటి సులభమైన మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఒకవేళ మీకూ ఇలాంటి అనుభవమే ఎదురైతే.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సైబర్ ఎక్స్‌పర్ట్ రూపేష్ మాటల్లోనే విందాం..

ఎలా హ్యాక్ చేస్తారు?

Advertisement

సైబర్ నేరగాళ్లు పంపిన లింకుల ఓపెన్ చేస్తే.. డైరెక్ట్ మన ఫోన్లోనే ఏపీకే డౌన్లోడ్ అవుతుంది. అలా ఇన్‌స్టాల్ అయిన ఏపీకే ఫైల్లో ఒక హిడెన్ మాల్వేర్ ఉంటుంది. ఇది మన ఫోన్‌లోని బ్యాంకు వివరాలను తక్షణమే తీసేకుంటుంది. దాంతో పాటు మన నెంబరుకు వచ్చే ఓటీపీలను సైబర్ నేరగాళ్ల నెంబర్లకు ఫార్వర్డ్ చేస్తుంది. ఇలా మన బ్యాంకు ఖాతాలోని డబ్బును దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.

ఇలా జాగ్రత్త పడదాం..

ఇలాంటి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండాలంటే.. మన ఫోన్‌కు వచ్చే మెసేజుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు ఎటువంటి ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయకుండానే, ఓటీపీలు షేర్ చేయకుండానే మీ ఖాతాలోని డబ్బు మాయం అయ్యిందంటే.. RBI రూల్స్ ప్రకారం డబ్బు చోరీ జరిగిన మూడ్రోజుల్లోగా సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఇలా తక్షణ ఫిర్యాదుతో మీరు కోల్పోయిన డబ్బు 100% శాతం రీఫండ్ చేయబడుతుంది. ఇలాంటి చోరీలకు గురవ్వకుండా ఉండాలంటే.. మీకొచ్చే మెసేజుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్‌పర్ట్ రూపేష్.

Related News

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

Big Stories

Advertisement
×