E-Paper
Advertisement

Peddi Movie: ‘పెద్ది’ సినిమా చూడాలంటే.. ముందు ‘దేవర’ కథ తెలియాలి.. ఇదేంటిది?

Peddi Movie: ‘పెద్ది’ సినిమా చూడాలంటే.. ముందు ‘దేవర’ కథ తెలియాలి.. ఇదేంటిది?
Advertisement

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ బర్త్‌‌డేని పురస్కరించుకుని మార్చి 27న విడుదల అని అధికారికంగా ప్రకటించిన తర్వాత, అనుకున్న టైమ్‌కి షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఏప్రిల్ 30కి విడుదల అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు మరోసారి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. అన్నీ కుదిరితే మే 7న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా చూడటానికి ముందు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ (Devara) చిత్ర కథ తెలియాలంటూ సోషల్ మీడియాలో ఒకటే వార్తలు. అంతే, అంతా ఇదేంటిది? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Also Read- Rowdy Janardhana: పెళ్లి తర్వాత జోరు పెంచిన విజయ్ దేవరకొండ .. రౌడీ జనార్ధన పై భారీ హైప్!

‘దేవర’ కథ తరహాలోనే..

Advertisement

పై లైన్ చదివిన తర్వాత.. కావాలని యాంటీ ఫ్యాన్స్ ఏమైనా ‘దేవర’కు లింక్ చేసి వార్తలు పుట్టిస్తున్నారా? అనే అనుమానాలు రావచ్చు. కానీ, ఇక్కడ విషయం ఏమిటంటే, ‘పెద్ది’ కథ దాదాపు ‘దేవర’ కథనే పోలి ఉంటుందనేలా సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తుంది. ‘దేవర’ సినిమాలో సముద్ర తీరంలోని రెండు ఊర్ల మధ్య అధిపత్య పోరు నడుస్తుందనే విషయం తెలియంది కాదు. సేమ్ టు సేమ్ ‘పెద్ది’ సినిమాలో కూడా కొండల్లో నివసించే రెండు గ్రామాల మధ్య నీటి కోసం గొడవలు జరగడం ఉంటుందని, ఈ నీటి గొడవ పరిష్కారానికి క్రికెట్‌ ఆటని లింక్ చేస్తూ బుచ్చిబాబు స్టోరీ నడిపించబోతున్నట్లుగా సోషల్ మీడియాలో సినిమా స్టోరీపై పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. ‘దేవర’ కథ ఏమోగానీ, కొండల్లో నివసించే రెండు గ్రామాలు అనగానే.. మెగా ఫ్యాన్స్ వెన్నులో వణుకు పుడుతోంది. ఎందుకంటే,

Also Read- Mallareddy Cinema: మల్లారెడ్డి ‘సినిమా’ ప్లాన్..! వెండితెరపై సీఎం డ్రీమ్..?

భయపడుతున్న ఫ్యాన్స్

Advertisement

మెగాస్టార్ చిరంజీవి తన తనయుడితో చేసిన ‘ఆచార్య’ సినిమా కొండల నేపథ్యంలోనే పాదఘట్టం, సిద్ధ వనం అంటూ పదే పదే వినిపించే పదాలతో ఉంటుంది. ఆ సినిమా రిజల్ట్ ఏమిటో, ఏం ఊహించుకుంటే, ఏం జరిగిందో? ఫ్యాన్స్‌కే కాదు ప్రేక్షకులందరికీ తెలుసు. ఇప్పుడదే నేపథ్యం అనగానే మెగా ఫ్యాన్స్ భయపడిపోతున్నారు. అందులోనూ కథ ‘దేవర’ని తలపించేలా ఉండటం, అందులో నటించిన జాన్వీ కపూరే ఇందులో నటించడం వంటి అంశాలతో.. ‘ఎక్కడో కొడుతుంది శీనా?’ అనేలా నెటిజన్ల కామెంట్స్‌కి తావిస్తోంది. ఈ భయం పోవాలంటే మాత్రం, మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే‌ని పురస్కరించుకుని వచ్చే టీజర్ వరకు వెయిట్ చేయాల్సిందే. టీజర్‌తో దాదాపు క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి.. ఫ్యాన్స్ కూడా ఓ లెక్కకి రావచ్చు. అప్పటి వరకు భారీగా అంచనాలు పెట్టుకోవడం మాత్రం అత్యాశే అవుతుంది. అసలే ‘గేమ్ ఛేంజర్’ దెబ్బకి కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఫ్యాన్స్‌కి ఇప్పుడు ‘దేవర’ అంటూ వినిపిస్తున్న వార్తలు నిద్రలేకుండా చేస్తున్నాయంటే.. ఫ్యాన్స్‌కు, సదరు హీరోకి ఈ సినిమా ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు.

Also Read- Meenakshi Chaudhary: బంగారం అంటే అమ్మాయి, అమ్మాయి అంటే బంగారం.. భలే చెప్పింది కదా!

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×