E-Paper
Advertisement

Peddi Movie: ఢిల్లీలో క్రికెట్ మ్యాచ్ ఆడనున్న రామ్ చరణ్, సైలెంట్ గా చక్కబెడుతున్న బుచ్చిబాబు

Peddi Movie: ఢిల్లీలో క్రికెట్ మ్యాచ్ ఆడనున్న రామ్ చరణ్, సైలెంట్ గా చక్కబెడుతున్న బుచ్చిబాబు
Advertisement

Ram Charan Peddi Movie: ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు బుచ్చిబాబు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విపరీతమైన సక్సెస్ సాధించింది. 100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. మొదటి సినిమాకి 100 కోట్లు కలెక్ట్ చేయడం అనేది గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ఇప్పటివరకు ఆ సినిమా తర్వాత వైష్ణవ తేజ్ చేసిన ఏ సినిమాకి కూడా ఆ స్థాయి కలెక్షన్లు రాలేదు.

డెబ్యూతోనే 100 కోట్లు

Advertisement

ఇక ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత విపరీతంగా దర్శకులకు అవకాశాలు రావడం అనేది సహజంగా జరుగుతుంది. అయితే కొంతమంది ఏ అవకాశం వస్తే దానిని చేసుకుంటూ పోతారు. కానీ ఇంకొంతమంది మాత్రం చాలా సెలెక్టెడ్ గా ఈ హీరోతో సినిమా చేయాలి అని పట్టుబట్టి కూర్చుంటారు. అలా కొంతవరకు ఎన్టీఆర్ తో జర్నీ చేశాడు బుచ్చిబాబు. కానీ చివరి నిమిషం వరకు ఎన్టీఆర్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చ్ 26న విడుదలకు సిద్ధంగా ఉంది.

ఢిల్లీలో క్రికెట్ మ్యాచ్

ప్రస్తుతం పెద్ది సినిమాకి సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ హైదరాబాదులో షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి నాలుగైదు రోజులు క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్ ఢిల్లీలో ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీలో క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్లీ హైదరాబాద్ వచ్చి 20 రోజులు కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తారు. ఒక ఐటెం సాంగ్ మినహాయిస్తే సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జనవరి మంత్ ఎండింగ్ కి పూర్తవుతుంది.జనవరి నెలలో షూటింగ్ పూర్తి అయిపోతే ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కు రెండు నెలలు తీసుకుంటాడు బుచ్చి. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన డేట్ కంటే ముందుగానే సినిమా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు ఈ సినిమా నుంచి విడుదలైన కాంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. మొదటి సాంగ్ ఆల్రెడీ 100 మిలియన్ వ్యూస్ పైగా సాధించింది.

Advertisement

Also Read: Varanasi OTT: వారణాసి ఓటీటీ డీల్ రూ. 650 కోట్లు.. రిజెక్ట్ చేసిన మేకర్స్, కారణమేంటంటే!

సైలెంట్ గా షూటింగ్ పూర్తి

ఈ సినిమాకి సంబంధించి ఎక్కువ హడావిడి చేయకుండా సైలెంట్ గానే షూటింగ్ పూర్తి చేస్తున్నాడు బుచ్చిబాబు. ఇప్పటివరకు వదిలిన రెండు కంటెంట్లు కూడా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో అసలు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది. అయితే రంగస్థలం సినిమా తర్వాత అదే రేంజ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. బుచ్చిబాబుని అంత తక్కువ అంచనా వేలం చూడ్డానికి చేతులు కట్టుకుని కనిపించినా కూడా బాక్సాఫీస్ బద్దలయ్య కంటెంట్ రెడీ చేస్తాడు అని చాలామందికి ఒక రకమైన నమ్మకం ఉంది. మొత్తానికి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×