E-Paper
Advertisement

Varanasi OTT: వారణాసి ఓటీటీ డీల్ రూ. 650 కోట్లు.. రిజెక్ట్ చేసిన మేకర్స్, కారణమేంటంటే!

Varanasi OTT: వారణాసి ఓటీటీ డీల్ రూ. 650 కోట్లు.. రిజెక్ట్ చేసిన మేకర్స్, కారణమేంటంటే!
Advertisement

Varanasi OTT Deal: ఇండియన్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో రాజమౌళి-మహేష్ బాబుల వారణాసి టాప్ లో ఉందనడంలో సందేహం లేదు. అనౌన్స్మెంట్ తోనే ఈ చిత్రం మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ తో వారణాసిపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో మహేష్ లుక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ ఈవెంట్ జక్కన్న ఓ రేంజ్ లో ప్లాన్ చేశాడు. ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్మెంట్ కి కూడా ఈ రేంజ్ లో ప్లాన్ చేయొచ్చని కూడా రుజువు చేశాడు రాజమౌళి.

గ్లోబ్ ట్రాటర్ తో పెరిగిన బజ్

Advertisement

గ్లోబ్ ట్రాటర్ తో ఇండియన్ ఆడియన్స్, ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అదే సమయంలో వారణాసి టైటిల్ వివాదం కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు నుంచి ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది. రాజమౌళి స్పీచ్ వైరల్ అవ్వడంతో పాటు పలు రకాల ఇష్యూస్ ఈ సినిమాకి వచ్చాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి టైటిల్ విషయంలో కూడా కొద్దిపాటి వివాదాలు వచ్చాయి. మొత్తానికి దీనిని ‘రాజమౌళి వారణాసి‘గా తెలుగులో మార్చారు. అయితే మహేష్ బాబు అభిమానులు రాజమౌళి వారణాసి ఏంటి మహేష్ బాబు వారణాసి ఉండాలి అని కొంతమంది ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అభిమానులు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మహేష్ కి ఇది మొదటి పాన్ ఇండియా సినిమా. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళికి మంచి గుర్తింపు దక్కింది.

భారీ ఓటిటి డీల్ రిజెక్ట్

కాబట్టి రాజమౌళి వారణాసి అని ఉండటం కరెక్ట్. అయితే ఈ సినిమా 2027లో వస్తుంది అని కీరవాణి అనౌన్స్ చేశారు. కానీ వస్తుంది అని నమ్మకం అయితే చాలామందికి లేదు. ఈ సినిమాకి సంబంధించి ఏకంగా నెట్ ఫ్లిక్స్ (Netflix Whopping Varanasi OTT Deal) సంస్థ రూ. 650 కోట్లు డీల్ ఇచ్చారట. అన్ని భాషల్లో కలిసి అంత మొత్తం ఆఫర్ చేశారట. అయితే వారణాషి మేకర్స్ అండ్ టీం మాత్రం దీనికి రిజెక్ట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇది కాకుండా ఇంకా బెటర్ డీల్ కోసం మూవీ టీం అండ్ మేకర్స్ చూస్తున్నారు. విడుదలకు ముందే ఓటీటీ డీల్ రూ. 650 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఇప్పటి ఏ సినిమా రాని ఫిగర ఇది. భవిష్యత్తులో ఇలాంటి ఫిగర్ ఉంటుందా? వస్తుందా? అని కూడా చెప్పలేం. కానీ, అంత పెద్ద మొత్తాన్ని మేకర్స్ రిజెక్ట్ చేశారంట రాజమౌళి పై ఉన్న నమ్మకమే అంటున్నారు. 

Advertisement

Also Read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు ఐబొమ్మ వార్నింగ్.. అసలు నిజం చెప్పిన ఇమ్మడి రవి

హై ఎక్స్పెక్టేషన్స్

ఇప్పటివరకు హైయెస్ట్ గా రూ. 375 కోట్లు కల్కి సినిమాకు ఆ డీల్ వచ్చింది. ఆ తర్వాత కేజిఎఫ్ సినిమాకు రూ. 320 కోట్లు, త్రిబుల్ ఆర్ సినిమాకు రూ. 300 కోట్లు ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు వారణాసి సినిమాకు ఏకంగా రెట్టింపు డీల్ వచ్చిన మేకర్స్ నచ్చడం లేదంటే అంతా అవాక్క్ అవుతున్నారు. మరి వారి నమ్మమేంటన్నది రిలీజ్ తర్వాత తేలిపోతుంది. మరోవైపు ఈ సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలానే ఈ సినిమాకి సంబంధించిన వరల్డ్ రాజమౌళి ఒక వీడియోతో పరిచయం చేశారు. ఆ వీడియో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచింది. మైథాలజీని కూడా ఈ సినిమాతో టచ్ చేస్తున్నారు. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×