Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘పెద్ది’ (Peddi Movie) చిత్రం.. విడుదల విషయంలో ఎన్నో సినిమాలను కన్ఫ్యూజ్ చేస్తోంది. మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమా ఏప్రిల్ 30కి వాయిదా పడింది. దీంతో మే ఫస్ట్ వీక్‌లో రావాల్సిన చాలా సినిమాలు, అంతకు ఒక వారం ముందు రావాల్సిన చిత్రాలన్నీ తమ రిలీజ్‌లను వాయిదా వేసుకున్నాయి. ముఖ్యంగా ‘లెనిన్’ టీమ్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.. ‘పెద్ది’ కోసమే వాయిదా వేసుకుంటున్నామని. అలాగే ‘గాయపడ్డ సింహం’ టీమ్ కూడా ‘పెద్ది’ విడుదల తేదీ ఉంటే మాత్రం కచ్చితంగా వాయిదా వేసుకుంటామని పబ్లిగ్గా ప్రకటించారు. ఇక అఖిల్ ‘లెనిన్’ (Lenin) టీమ్ అయితే మరో తేదీని కూడా ప్రకటించారు. జూన్ 26వ తేదీకి వాయిదా వేస్తున్నామని అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Also Read- Mega Hero: మరోసారి మెగా హీరో మ్యారేజ్‌పై రూమర్స్.. ఆ హీరోయిన్‌తోనే అంటూ..!
ఇప్పుడేమో ఏప్రిల్ 30 కాదంటూ, సోషల్ మీడియా అంతా ఒకటే వార్తలు. నిజంగా సినిమాపై, షూటింగ్‌పై క్లారిటీ లేకుండా ఇన్ని సార్లు డేట్ ప్రకటించడం ఎందుకు? ఒకసారి అంటే, ఏదో అనివార్య కారణాలు, సాంకేతిక కారణాలు అని చెప్పువచ్చు. మళ్లీ మళ్లీ అంటూ సినిమాపై ఉన్న క్రేజ్ కూడా పోతుంది. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘పెద్ది’ సినిమా జూన్ 25 లేదంటే 26 అని అంటున్నారు. అదీ కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే, ఇన్ని వార్తలు వినిపిస్తున్నా, ఇంతగా ఇండస్ట్రీ సఫర్ అవుతున్నా ‘పెద్ది’ టీమ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా కామ్‌గానే ఉంటుంది తప్పితే.. వార్తలను ఖండించడం లేదు, అదే సమయంలో వాయిదా అని కూడా చెప్పడం లేదు. ఈ మౌనానికి అర్థం ఏంటో తెలియక, ఇండస్ట్రీ జనాలే కాకుండా, అభిమానులు కూడా జుట్టు పీక్కుంటున్నారు.
Also Read- థమన్, ఏఆర్ రెహమాన్ దారిలో మణిశర్మ.. మంచిరోజులొచ్చినట్టేనా?
మరోవైపు సినిమా షూటింగ్‌ను శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నట్లుగా కూడా టాక్ నడుస్తుంది. ఇదే టైమ్‌లో సినిమాపై ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి నిర్మాత వెంకట సతీష్ కిలారు ‘పుష్ప 2’ బిజినెస్‌కు మూడింతలు రెట్టు చెబుతున్నట్లుగా కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇంత గందరగోళం నడుమ.. అసలు ‘పెద్ది’ ఈ సంవత్సరం వస్తుందా? లేదా? అనేలా ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. దర్శకుడు బుచ్చిబాబుని తలా అని పిలుచుకుంటున్న వారు కూడా ఆయనపై ఫైర్ అవుతున్నారంటే, ఎంతగా టీమ్ విసిగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే.. అన్నీ చూసుకునే వస్తామని, ఏదో ఒకటి క్లారిటీ ఇస్తే, మిగతా సినిమాల నిర్మాతలు కాస్త సేఫ్ అవుతారు కదా. అదేం లేకుండా, వాటన్నింటినీ వెయిట్ లిస్ట్‌లో పెట్టి, ఈ దాగుడు మూతలు ఎందుకు? అనేలా ‘పెద్ది’ టీమ్‌పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరి ఇకనైనా టీమ్ క్లారిటీ ఇస్తే.. అంతా ఎవరి పని వారు చూసుకుంటారు. ఇంకా, ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తామంటే మాత్రం.. ‘పెద్ది’ పని అయిపోయినట్టే.
Also Read- Koratala Siva: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు.. అదీ ‘పిఠాపురంలో’!