E-Paper
Advertisement

ఆ ఇంట్లో అడుగుపెడితే మరణం తప్పదా?… ఈ తోపు సిరీస్ కు ఎవ్వరైనా వణికిపోవాల్సిందే… ఐయండిబిలో 8.5 రేటింగ్

ఆ ఇంట్లో అడుగుపెడితే మరణం తప్పదా?… ఈ తోపు సిరీస్ కు ఎవ్వరైనా వణికిపోవాల్సిందే… ఐయండిబిలో 8.5 రేటింగ్
Advertisement

Horror Thriller OTT : హారర్ సిరీస్ లు భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఈ స్టోరీలు చూసేందుకు చాలా క్రేజీగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్, ఓటీటీ చరిత్రలోనే అత్యంత భయంకరమైన సిరీస్‌లలో ఒకటిగా పేరు పొందింది. ఇందులో మొత్తం 10 ఎపిసోడ్లు ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ ను చూడాలంటే చాలా దైర్యం కూడా కావాలి. దీనికి ఐయండిబిలో 8.5 రేటింగ్ ఉందంటే ఈ సిరీస్ ఎలా ఉంటుందో అంచనా వేయచ్చు. ప్రముఖ హారర్ రచయిత స్టీఫెన్ కింగ్ ఈ సిరీస్‌ను చూసి మెచ్చుకున్నారు కూడా.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

2018లో వచ్చిన ఈ అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ సిరీస్ పేరు ‘ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్’ (The Haunting of Hill House). ఇందులో మిషీల్ హుయిస్మాన్, కార్లా గుగినో, హెన్రీ థామస్, ఎలిజబెత్ రీజర్ వంటి ప్రముఖ నటులు నటించారు. ఇది మైక్ ఫ్లానాగన్ దర్శకత్వంలో రూపొందింది. ఈ సిరీస్‌లో దర్శకుడు మైక్ ఫ్లానాగన్ ప్రతి ఎపిసోడ్‌లోనూ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు తెలియకుండానే దాదాపు 43 దాకా దెయ్యాలను ఉంచారు. వీటిని గుర్తించడం చాలా కష్టం. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే, తలుపుల వెనుక, మెట్ల కింద, చీకటి గదుల్లో మొహాలు లేదా చేతులు కనిపిస్తాయి. ఈ సిరీస్ మొత్తం 45 నామినేషన్లను పొంది, 9 అవార్డులను గెలుచుకుంది. ముఖ్యంగా హెన్రీ థామస్ తన నటనకు ‘సాటర్న్ అవార్డు’ను గెలుచుకున్నారు. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హ్యూ క్రైన్ అనే వ్యక్తి తన భార్య ఓలివియా, ఇంకా ఐదుగురు పిల్లలతో కలిసి ‘హిల్ హౌస్’ అనే పాత బంగ్లాలోకి వస్తాడు. ఆ ఇల్లు రిపేరు చేసి మంచి రేటుకు అమ్మేద్దామని వాళ్ల ప్లాన్. కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి వింత వింత శబ్దాలు, ఎవరో తిరుగుతున్నట్టు అనిపించడం మొదలవుతుంది. ఆ ఇంట్లో ఉన్న దెయ్యాలు ఒక్కొక్కరిని భయపెట్టడం స్టార్ట్ చేస్తాయి. ఒక భయంకరమైన రాత్రి ఏమైందో ఏమో కానీ, హ్యూ తన ఐదుగురు పిల్లలను తీసుకుని ప్రాణాలకు తెగించి ఆ ఇంటి నుండి పారిపోతాడు. కానీ పాపం, వాళ్ల అమ్మ ఓలివియా మాత్రం ఆ ఇంట్లోనే చనిపోతుంది.

ఆ సంఘటన జరిగిన 26 ఏళ్ల తర్వాత ఆ పిల్లలందరూ పెద్దవాళ్లవుతారు. కానీ చిన్నప్పుడు ఆ ఇంట్లో జరిగిన దారుణాలు వాళ్లని వదలవు. పెద్దోడు స్టీవెన్ ఆ దెయ్యాల కథలనే పుస్తకాలుగా రాసి డబ్బు సంపాదిస్తుంటాడు. రెండో అమ్మాయి షిర్లీ శవాలకు మేకప్ వేసే పనిలో ఉంటుంది. థియో అనే అమ్మాయికి ఎవరిని తాకినా వాళ్ల ఫీలింగ్స్ తెలిసిపోతుంటాయి. ఇక కవలలైన ల్యూక్ డ్రగ్స్‌కి బానిస అయితే, నెల్ అనే అమ్మాయి ఆ పాత జ్ఞాపకాలతో పిచ్చిదైపోతుంది. ఒకరోజు నెల్ మళ్ళీ అదే హిల్ హౌస్‌కి వెళ్లి అక్కడ చనిపోతుంది. ఆ అంతుచిక్కని మిస్టరీ, నెల్ ఎలా చనిపోయిందో తెలుసుకోవడానికి వీళ్లంతా మళ్ళీ ఆ పాత హిల్ హౌస్‌కి వెళ్తారు.

Advertisement

అక్కడ వెళ్ళాక వీళ్లకు అసలు నిజాలు తెలుస్తాయి. ఆ ఇల్లు మామూలు ఇల్లు కాదు, అది మనుషులను మింగేసే ఒక రాక్షసి లాంటిదని అర్థమవుతుంది. అది ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తూ వాళ్లని ట్రాప్ చేస్తుంటుంది. ఇప్పుడు ఆ ఇంట్లో హారర్ పీక్స్ కి వెళ్తుంది. చివరికి వీళ్ళంతా ఆ రాకాసి దెయ్యాన్ని అంతం చేశారా ? పిల్లలందరూ ఆ గండం నుండి బయటపడతారా ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న 26 ఏళ్ల హాలీవుడ్ మూవీ… యాక్టింగ్ ఇరగదీసిన బ్రాడ్ పిట్… ఐయండిబిలో 8.8 రేటింగ్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×