E-Paper
Advertisement

థమన్, ఏఆర్ రెహమాన్ దారిలో మణిశర్మ.. మంచిరోజులొచ్చినట్టేనా?

థమన్, ఏఆర్ రెహమాన్ దారిలో మణిశర్మ.. మంచిరోజులొచ్చినట్టేనా?
Advertisement

Manisharma: ఇళయరాజా తర్వాత అంత గొప్ప ప్రతిభ కలిగిన సరస్వతి పుత్రుడు ఎవరయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేరు మెలోడీ బ్రహ్మ ‘మణిశర్మ’. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన గొప్ప సంగీత దర్శకుడు మణిశర్మ. అప్పటి స్టార్ హీరోలందరూ మణిశర్మ (Manisharma) మాత్రమే కావాలంటూ ఎలా వెంటపడ్డారో తెలియంది కాదు. మణిశర్మ కూడా ఆయన పని చేసిన స్టార్ హీరోలందరికీ ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తిండిపోయేలా అద్భుతమైన పాటలను ఇచ్చారు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనే పదానికి సరికొత్త అర్థాన్ని, అందాన్ని తెచ్చిన వ్యక్తి కూడా ఆయనే. అలాంటి మణిశర్మ.. తాజాగా జరిగిన ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) సాంగ్ లాంచ్ వేడుకలో ఈగలు తోలుకుంటున్నానని అనగానే ఆయన అభిమానులందరూ ఎంతగానో తల్లడిల్లిపోతున్నారు. వాస్తవానికి మణిశర్మకు ఈ మధ్యకాలంలో కూడా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ, రొట్టకొట్టుడుకి అలవాటు పడిన వారికి ఏం తెలుస్తుంది రిథమిక్ మ్యూజిక్ గురించి.. అనేలా మణిశర్మ మ్యూజిక్‌లో అమృతాన్ని గుర్తించలేకపోయారు.

Also Read- Mega Hero: మరోసారి మెగా హీరో మ్యారేజ్‌పై రూమర్స్.. ఆ హీరోయిన్‌తోనే అంటూ..!

రెహమాన్, థమన్ బాటలో మణిశర్మ

Advertisement

అదే సమయంలో ఆ సినిమాలు కూడా అంత గొప్పగా ఆడకపోవడంతో, మణిశర్మ మ్యూజిక్ గొప్పతనం కూడా ఎవరికీ తెలియలేదు. అలాగే, నేటి అప్డేటెడ్ జనరేషన్‌కు అనుగుణంగా మారలేక, ఆయన హార్మోణీ పెట్టేను పక్కన పెట్టేశారు. అయినా సరే, టాలెంట్ ఉన్నోడిని ఖాళీగా ఎందుకు ఉండనిస్తారు. అప్డేట్ అయ్యేలా చేసి మరీ, మ్యూజిక్ కొట్టించుకున్నారు ‘చెన్నై లవ్ స్టోరీ’ మేకర్స్. ఎంత అప్డేట్ అయ్యారంటే.. ఫస్ట్ సాంగ్‌కే రెహమాన్ (AR Rahman), థమన్‌ (Thaman)ల బాటలో సముద్రపు ఒడ్డుకు అంతా మార్చేశారు. ఇటీవల వచ్చిన ‘పెద్ది’ సినిమాలోని పాట కంపోజిషన్‌కు ఎలా అయితే రెహమాన్, సింగర్, దర్శకుడు బుచ్చి ఉన్నారో.. సేమ్ టు సేమ్ ఇప్పుడు మణిశర్మ కూడా తన టీమ్‌తో సముద్రపు ఒడ్డున ఈ పాటకు బాణీలను అందిస్తున్నట్లుగా ఈ పాటలో చూపించారు.

Also Read- Balakrishna 112: బాలకృష్ణ వివేక్ ఆత్రేయ సినిమాకు అదిరిపోయే టైటిల్..

మణిగాడ్ ఈజ్ బ్యాక్

Advertisement

ఇక థమన్ గురించి చెప్పేదేముంది.. ప్రతి పాటకు మిలియన్ల వ్యూస్ రాబట్టాలని, ప్రత్యేక బడ్జెట్ వేయించుకుని మరి, పాటలను కంపోజ్ చేస్తుంటారు. అదంతా ఆయన మేకింగ్‌లో చూపిస్తుంటారు. ఇప్పుడు మణిగాడ్ కూడా నేను కూడా మారాను.. అనేలా ఈ పాటతో అందరికీ హింట్ ఇచ్చేశారు. అలాగే, విడుదలైన పాట కూడా మంచి స్పందనను రాబట్టుకోవడంతో.. ‘మణిగాడ్ ఈజ్ బ్యాక్’ అంటూ ఆయన అభిమానులు సంతోషాన్ని తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమాతో కనుక మంచి బ్రేక్ వస్తే మాత్రం.. మళ్లీ కొన్నాళ్ల పాటు మంచి సంగీతం వినే భాగ్యం తెలుగు ప్రేక్షకులకు దక్కుతుందని, నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. చూద్దాం.. మణిశర్మకు ఈ సినిమా ఎలా యూజ్ అవుతుందో..

Also Read- సినీ హీరోలకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సవాల్.. 90 రోజులకోసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోండి!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×