Peddi Movie: టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు ప్రస్తుతం ఎక్కడ చూసినా పెద్ది ఫీవర్ అంటుకుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ పహిల్వాన్ లుక్, జాన్వీ కపూర్ డీ గ్లామరస్ గెటప్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అటు బుచ్చిబాబు సనా తన టాలెంట్ తో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయారు. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ బీజీఎం తో మైమరిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఎట్టకేలకు ఇవన్నీ తెరపై చూడాలి అంటే జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే. ఇక భారీ అంచనాల మధ్య అభిమానుల ఎదురుచూపుతో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం మేకర్స్ ప్రమోషన్స్ ను భారీగా ప్లాన్ చేశారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకి ప్రమోషన్స్ ను చాలా కీలకంగా చేపట్టనున్నట్లు చిత్ర బృందం భావిస్తోందట. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై హైప్ తీసుకొచ్చాయి. పైగా సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరలో పవర్ఫుల్ ట్రైలర్ తో పాటు మాస్ ఐటమ్ సాంగ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
మరొకవైపు దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది. పైగా జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ తార ఇందులో ప్రధాన లీడ్ పోషిస్తున్న నేపథ్యంలో అక్కడి వారిని ఆకర్షించుకోవడానికి జాన్వీ కపూర్ ను ప్రధానంగా ఉపయోగించుకోబోతున్నారట. ఈ మేరకు ప్రధాన నగరాలైన చెన్నై, కేరళ, ముంబై వంటి ప్రాంతాలలో ప్రమోషన్స్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్, జాన్వీ కపూర్ ఈ ప్రాంతాలకు వెళ్లి స్వయంగా స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వనున్నట్లు సమాచారం. రెహమాన్ మ్యూజిక్ కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే మాత్రం పెద్ది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మరి రామ్ చరణ్ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.
ALSO READ:పెద్ది మూవీ ఫస్ట్ రివ్యూ.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రొడక్షన్ డిజైనర్!
ఇదిలా ఉండగా ఈ సినిమాపై అంచనాల పెంచడానికి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. మే 17 లేదా 18వ తేదీలలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. అనంతరం మాస్ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఇక అంతేకాదు జూన్ 2వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఎట్టకేలకు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి ఈ ప్రమోషన్స్ ఏవిధంగా కలిసి వస్తాయో చూడాలి.