E-Paper
Advertisement

హ్యుందాయ్ లవర్స్ కు షాక్.. i20 N లైన్‌ లో ఆ వేరియంట్లు డిస్ కంటిన్యూ!

హ్యుందాయ్ లవర్స్ కు షాక్..  i20 N లైన్‌ లో ఆ వేరియంట్లు డిస్ కంటిన్యూ!
Advertisement

Hyundai Revises i20 N Line: హ్యుందాయ్ తన స్పోర్టీ హ్యాచ్‌ బ్యాక్ i20 N లైన్ శ్రేణిలో కొన్ని మార్పులు చేసింది. ఈ మోడల్ లోని కొన్ని వేరియంట్లను నిలిపివేసింది. ముఖ్యంగా N6 DCT వేరియంట్‌ ను అధికారికంగా లిస్ట్ నుంచి తప్పించింది. ఇకపై డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్ టాప్ వేరియంట్ N8లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఇప్పటి వరకు i20 N లైన్ కొనుగోలు చేయాలనుకునే వారికి N6 వేరియంట్‌ లో కూడా DCT గేర్‌బాక్స్ ఎంపిక ఉండేది. కానీ, ఇప్పుడు ఆ ఆప్షన్‌ ను తొలగించడంతో ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ కోరుకునే వారు తప్పనిసరిగా N8 వేరియంట్‌ ను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే N6 ట్రిమ్‌ లో డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లను కూడా నిలిపివేశారు. ఈ వేరియంట్ ఇప్పుడు సాధారణ సింగిల్ కలర్ ఎంపికలతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరోవైపు టాప్ స్పెక్ N8 వేరియంట్‌ లో మాత్రం పెద్ద మార్పులు చేయలేదు. ఈ ట్రిమ్‌ లో ఇప్పటికీ డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ అందుబాటులో ఉంది. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్‌ తో పాటు 7 స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ఎంపికను కూడా కొనసాగిస్తున్నారు.

Advertisement

హ్యుందాయ్ i20 N లైన్‌ ను భారత మార్కెట్లో మొదటిసారి సెప్టెంబర్ 2021లో విడుదల చేసింది. అప్పట్లో ఈ కారును 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ తో పరిచయం చేశారు. స్టార్టింగ్ లో iMT, DCT గేర్‌ బాక్స్ ఎంపికలతో రెండు ప్రధాన వేరియంట్లలో విక్రయించారు. ఆ తర్వాత అక్టోబర్ 2023లో ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్‌ ను తీసుకువచ్చినప్పుడు కంపెనీ iMT గేర్‌ బాక్స్‌ ను తొలగించి, సాధారణ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

డిజైన్ లో మార్పులు

ఫేస్‌ లిఫ్ట్ టైమ్ లో కారుకు కొన్ని కొత్త డిజైన్ మార్పులు, అదనపు ఫీచర్లను యాడ్ చేసింది. i20 N లైన్ సాధారణ i20తో పోలిస్తే మరింత స్పోర్టీ లుక్ కలిగి ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన బంపర్లు, రూఫ్ స్పాయిలర్, రెడ్ బ్రేక్ కాలిపర్లు, డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ లాంటి స్టైలింగ్ అంశాలు ఉన్నాయి. లోపలి భాగంలో కూడా పూర్తిగా బ్లాక్ థీమ్, ఎరుపు రంగు హైలైట్స్, N లైన్ బ్యాడ్జింగ్ కనిపిస్తాయి.

Advertisement

ఇంజన్ విషయానికి వస్తే, ఇందులోని 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. సిటీ ప్రయాణంతో పాటు హైవేపై కూడా స్పోర్టీ డ్రైవింగ్ ఫీల్ అందిస్తుంది. ముఖ్యంగా కొత్తగా కొనుగోలు చేసే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ కారును రూపొందించారు.

ధరలు ఎలా ఉన్నాయంటే?

ప్రస్తుతం i20 N లైన్ ధరలు రూ.9.22 లక్షల నుంచి రూ.11.67 లక్షల వరకు ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ కారు.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ టర్బో పెట్రోల్ వేరియంట్లకు పోటీగా నిలుస్తోంది. మరోవైపు ఈ సెగ్మెంట్‌ లో పోటీ ఇచ్చిన టాటా ఆల్ట్రోజ్ రేసర్‌ ను ఇప్పటికే నిలిపివేశారు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ ఇప్పుడు i20 N లైన్ లైనప్‌ ను కొంత సింపుల్ చేయడంతో పాటు, టాప్ వేరియంట్‌ కు మరింత ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

Read Also: కళ్లు చెదిరే రేంజ్, క్రేజీ కలర్స్.. నయా ఐక్యూబ్ అదిరింది భయ్యా!

Related News

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మారుతి కస్టమర్లకు షాక్.. మళ్లీ ధరలు పెంపు, ఈసారి ఎంతంటే?

కార్నివాల్ హైబ్రిడ్ To న్యూ సోనెట్.. కియా నుంచి రాబోతున్న 10 క్రేజీ కార్లు ఇవే!

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఏముంది గురూ!

Big Stories

Advertisement
×