E-Paper
Advertisement

బుచ్చి బాబు ‘ఉప్పెన’తో మెగా ఫ్యాన్స్ ఖుషీ.. మరి ‘పెద్ది’కి అంత సీన్ ఉందా?

బుచ్చి బాబు ‘ఉప్పెన’తో మెగా ఫ్యాన్స్ ఖుషీ.. మరి ‘పెద్ది’కి అంత సీన్ ఉందా?
Advertisement

Peddi Rumours: తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లను సాధించడం అనేది ఏ దర్శకుడికైనా ఒక కల. ఆ కలను నిజం చేసుకున్న అతి కొద్దిమందిలో బుచ్చిబాబు సన ఒకరు. ‘ఉప్పెన’ వంటి సంచలన విజయం తర్వాత, ఆయన తన రెండో సినిమాకే ఏకంగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోవడం టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ సినిమా విడుదల విషయంలో వస్తున్న కొన్ని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Read also-Nindu Noorella Saavasam Serial Today Episode May 11th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కోసం మనోహరి కొత్త ప్లాన్

రీ-షూట్ వార్తలు: నిజమెంత?

Advertisement

సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు ఆలస్యమవుతున్నప్పుడు రకరకాల పుకార్లు రావడం సహజం. ‘పెద్ది’ చిత్రం విషయంలో కూడా ఇప్పటికే రెండు సార్లు విడుదల వాయిదా పడటంతో, సినిమా అవుట్‌పుట్ సరిగా రాలేదని, అందుకే దర్శకుడు కీలక సన్నివేశాలను రీ-షూట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, చిత్ర యూనిట్ వర్గాల ప్రకారం.. బుచ్చిబాబు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రామ్ చరణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, ప్రతి ఫ్రేమ్‌ను పర్‌ఫెక్ట్‌గా తీసుకురావాలనే ఉద్దేశంతోనే సమయం తీసుకుంటున్నారే తప్ప, ఫుటేజ్ ఫెయిల్యూర్ కాదని తెలుస్తోంది.

స్పోర్ట్స్ డ్రామాపై భారీ హైప్

ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ముఖ్యంగా క్రికెట్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ జర్నీగా దీనిని రూపొందిస్తున్నారు. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకుంటున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు అతిపెద్ద బలం. ఇప్పటికే ఆయన అందించిన ట్యూన్స్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించబోతున్నాయని టాక్.

Advertisement

Read also-మదర్స్ డే రోజున దళపతి విజయ్ కొడుకు పోస్ట్ చూస్తే కన్నీళ్ళు ఆగవు భయ్యా..

మెగా అభిమానుల ఆసక్తి

వైష్ణవ్ తేజ్‌ను ‘ఉప్పెన’తో స్టార్‌గా మార్చిన బుచ్చిబాబు, ఇప్పుడు తన అభిమాన హీరో చరణ్‌ను ఎలా చూపిస్తారో అని మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నెగిటివిటీ ఎన్ని రకాలుగా వినిపించినా, ఈ కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తర్వాత పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌పైనే దృష్టి పెట్టారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా బుచ్చిబాబు ముందుకు వెళ్తున్నారు. ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టిస్తుందని, బుచ్చిబాబు తన ‘సెకండ్ ఫిలిం సిండ్రోమ్’ను బ్రేక్ చేసి మరో భారీ విజయాన్ని అందుకుంటారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఏం చేస్తుంతో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×