E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 11th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కోసం మనోహరి కొత్త ప్లాన్

Nindu Noorella Saavasam Serial Today Episode May 11th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కోసం మనోహరి కొత్త ప్లాన్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ గతం మర్చిపోయాడన్న విషయం తెలియగానే.. మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. డాక్టర్‌ అమర్‌ గురించి చెప్పి జాగ్రత్తగా చూసుకోమని మిస్సమ్మ చెప్పి వెళ్లిపోగానే.. మిస్సమ్మ ఏడుస్తుంటే.. మనోహరి, చంభా కలిసి తమ రూంలోకి వెళ్తారు. మనోహరి హ్యాపీగా చంబా తలుపు వేశావా..? అని అడుగుతుంది. దీంతో చంబా ఎందుకు అని అడగ్గానే.. మనోహరి వెయ్యి చెప్తాను.. వెయ్యి వెయ్యి అంటూ చెప్పగానే.. చంభా తలుపు వేసి వస్తుంది. దీంతో మనోహరి ఫోన్‌లో సాంగ్‌ పెట్టుకుని డాన్స్‌ చేస్తుంది. చంభా ఆశ్చర్యంగా చూస్తుంది. ఆపు మనోహరి ఏంటా పిచ్చి గంతులు.. అనగానే.. మనోహరి ఇవి పిచ్చి గంతులు కావు చెప్పలేనంత సంతోషం, పట్టరాని ఆనందం.. నాకు చాలా థ్రిల్లింగ్‌ గా ఉంది.  గాలిలో తేలుతున్నట్టుగా ఉంది. అంటూ సంతోషంగా ఉంటే..

చంభా కోపంగా  అమరేంద్ర సార్‌ గతం మర్చిపోయారని అక్కడ అందరూ శోఖసముద్రంలో మునిగి తేలుతుంటే.. నువ్వు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నావా..? అనగానే.. మనోహరి సంతోషంగా అమర్‌ గతం మర్చిపోవడం వాళ్లకు మైనస్‌ అయితే నాకు ప్లస్‌ కదా అంటుంది. దీంతో చంభా అంతేలే సార్‌ కళ్లు తెరవగానే.. నీ అంతు తేలుస్తారు అనుకున్నాను. కానీ నీ అదృష్టం బాగుంది అంటుంది. దీంతో మనోహరి అదృష్టం బాగుండటం కాదు చంభా బ్రహ్మండంగా ఉంది. నా పని అయిపోయింది. నేను ఓడిపోతాను అనుకున్న ప్రతిసారి చివరి క్షణంలో నేను గెలుస్తూనే వస్తున్నాను. దేవుడున్నాడు చంభా నా పక్కనే ఉన్నాడు. ప్రతిసారి నన్ను కాపాడుతూనే ఉన్నాడు. అందుకే అరుంధతిని చంపినప్పుడు దొరకలేదు.. భాగీని ఈ ఇంటి నుంచి పంపినప్పుడు దొరకలేదు.. ఆఖరికి నేను ఎంతగానో ప్రేమిస్తున్న అమరేంద్రను చంపాలనుకున్నప్పుడు కూడా దొరకలేదు. ఓటమి అంచుదాకా వెళ్లి నేను గెలుస్తున్నాను.. అని చెప్పగానే..

Advertisement

చంభా నువ్వు గెలువలేదు మనోహరి తప్పించుకుంటున్నావు అంతే.. అమర్‌ సార్‌ ఇంకా భాగీ వైపే ఉన్నారు. ఎందుకంటే సార్‌ నీకు సొంతం అవ్వలేదు. అనగానే.. మనోహరి అది ఇంక ఎంతో దూరంలో లేదు చంభా ఎందుకంటే అమర్‌ ఇక చచ్చి బతికాడు. కానీ ఈ కొత్త జన్మ నాకోసమే.. నా కోసమే అమర్‌ కొత్త జన్మ ఎత్తాడు అని చెప్పగానే.. చంభా కోపంగా సార్‌ గతం మర్చిపోయారు. ఆ గతం ఎప్పుడైనా గుర్తు రావొచ్చు అని డాక్టర్‌ చెప్పారు కదా..? అనగానే.. మనోహరి ఎప్పటికైనా గుర్తుకు రాకపోవచ్చని కూడా డాక్టర్‌ చెప్పారు. అమర్‌కు తన పేరు కూడా గుర్తు లేదు. ఇక నేను అరుంధతిని చంపానని.. రణవీర్‌ భార్యనని నేను చేసిన ఎన్నో తప్పులతో సహా అమర్‌కు ఏదీ గుర్తు లేదు. అమర్‌ ఇప్పుడొక వైట్‌ పేపర్‌. ఆ పేపర్ మీద నా పేరు రాసుకుంటాను. అమర్‌ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునేలా చేసుకుంటాను. చంభా నా కల నెరవేరబోతుంది అనగానే.. చంభా నువ్వు ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ భాగీ, రాథోడ్‌ చూస్తూ ఊరుకుంటారా..? అనగానే.. మనోహరి చూస్తూ ఊరుకోక ఏం చేస్తారు. అమర్‌కు ఇప్పుడు ఆ అరుంధతియే గుర్తు లేదు. ఈ భాగీ, దాని కూతురు, పిల్లలు ఆ రాథోడ్‌ ఏం గుర్తు ఉంటారు అని చెప్తుంటే..

ఒకవేళ వాళ్లు గుర్తు చేస్తే అని చంభా అడగ్గానే.. వాళ్ల కంటే ముందు అమర్‌ దగ్గరకు నేనే వెళ్తాను. నా గురించి నాకు అనుకూలంగా నేను చెప్పేసుకుంటాను. నా పక్కనున్న దేవుడు నాకు ఈ సెకండ్‌ చాన్స్‌ ఇచ్చాడు. నాకు ఈ బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. అనగానే.. చంభా ప్రతిసారి దేవుడు నీ పక్కనే ఉన్నాడు అనకు మనోహరి. నీ పక్కనే ఉన్నది. నీ మాజీ భర్త రణవీర్‌. దెయ్యంలా వెంట తిరిగే ఆ ఘోరా, క్షుద్రపూజలు చేసే నేను మా వల్లే నువ్వు ఇక్కడి దాకా వచ్చావు అనగానే.. మనోహరి మీరు నాకు సాయం మాత్రమే చేశారు. కానీ ఆ దేవుడు నేను ఊహించని వరమే ఇచ్చాడు. ఇక నుంచి చూడు చంభా అమర్‌ను నా వైపు తిప్పుకుని భాగీని మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను. రాథోడ్‌ను రాచి రంపాన పెడతాను. పిల్లలను చిత్రవధ చేస్తాను. అమర్‌ను ఈ ఇంటిని ఆస్థిని నా సొంతం చేసుకుని నేను ఎప్పటి నుంచో కలలు కంటున్న జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తాను అంటూ వెళ్లిపోతుంది.

Advertisement

దీంతో చంభా భయంగా దేవుడా మనోహరి వల్ల ఇప్పటికే ఈ ఇల్లు అల్లకల్లోలం అయింది. సార్‌ పరిస్థితి అడ్డం పెట్టుకుని మనోహరి ఇంకెంత అల్లకల్లొలం సృష్టిస్తుందో ఇంకెన్ని నేరాలు ఘోరాలు చేస్తుందో.. తలుచుకుంటేనే భయంగా ఉంది అని చంభా భయపడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

Big Stories

Advertisement
×