Vijay Family: తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని మాస్ హీరోగా వెలుగొందిన దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోనూ తన మార్క్ చూపిస్తున్నారు. తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) తమిళనాడు ఎన్నికల్లో గెలుపొందగా ఆయన ఆదివారం ఆయన ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అక్కడకు భార్య, పిల్లలు ఎవ్వరూ కారపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే, ఈ రాజకీయ ప్రస్థానంలో విజయ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఆయన వ్యక్తిగత జీవితం కుటుంబ సభ్యుల గైర్హాజరీ.
READ ALSO-Brahmamudi Serial Today Episode May 11th ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజు తమ మనవడేనన్న సుభాష్
మదర్స్ డే పోస్ట్
సాధారణంగా సెలబ్రిటీల పిల్లల పోస్ట్లు వైరల్ అవ్వడం సహజమే. కానీ, విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ మదర్స్ డే సందర్భంగా పెట్టిన పోస్ట్ వెనుక రాజకీయ కోణం వెతుకుతున్నారు నెటిజన్లు. సంజయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్ చేస్తూ.. “Behind every strong soul is a mother’s love that shaped it first. Happy Mother’s Day” అని క్యాప్షన్ ఇచ్చారు. విజయ్ రాజకీయాల్లో అత్యున్నత స్థానానికి చేరుకుంటున్న తరుణంలో, కుమారుడు తండ్రి గురించి ప్రస్తావించకుండా కేవలం తల్లికి మాత్రమే క్రెడిట్ ఇవ్వడం చర్చలకు దారితీసింది.
Read also-ఫ్యాన్స్ కు పూనకాలే..జన నాయగన్ విడుదల పై మేకర్స్ క్లారిటీ..రిలీజ్ ఎప్పుడంటే?
కనిపించని భార్య, పిల్లలు
విజయ్ రాజకీయ వేదికలపై ఎక్కడా ఆయన భార్య సంగీత గానీ, పిల్లలు గానీ కనిపించడం లేదు. ముఖ్యంగా పార్టీ జెండా ఆవిష్కరణ లేదా కీలక సమావేశాల్లో కూడా వారు గైర్హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత ఏడాది కాలంగా విజయ్, ఆయన భార్య సంగీత విడివిడిగా ఉంటున్నారని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సంగీత ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నట్లు సమాచారం. కూతురు దివ్య, కుమారుడు సంజయ్ ఇద్దరూ తల్లికి దగ్గరగా ఉంటున్నారని, అందుకే విజయ్ పొలిటికల్ ఈవెంట్స్ కి వారు దూరంగా ఉంటున్నారని టాక్. జాసన్ సంజయ్ ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్‌తో తన తొలి సినిమాను డైరెక్ట్ చేశారు.