E-Paper
Advertisement

రామ్ చరణ్ పెద్ది మూవీ రన్ టైమ్ పై కొత్త చర్చ.. ట్రైలర్ రిలీజ్ అక్కడే!

రామ్ చరణ్ పెద్ది మూవీ రన్ టైమ్ పై కొత్త చర్చ.. ట్రైలర్ రిలీజ్ అక్కడే!
Advertisement

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పెద్ది. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకి బుచ్చి బాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ పై కొత్త చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా అలా అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

పెద్ది రన్ టైమ్ వైరల్..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ పెద్ది సినిమా సుమారుగా 3గంటల 20 నిమిషాల నిడివితో ఉండబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈమధ్య కాలంలో మూడు గంటలకంటే ఎక్కువ నిడివితో వచ్చిన దాదాపు ఎన్నో సినిమాలు (పుష్ప 2, RRR, ధురంధర్) కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. పైగా కంటెంట్ ఉంటేనే ఆ రేంజ్ లో సక్సెస్ లభిస్తుంది అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ట్రైలర్ రిలీజ్ అక్కడే.

Advertisement

ఇకపోతే జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మే 17వ తేదీన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఇండోర్ లేదా పాట్నాలో భారీగా ట్రైలర్ లాంఛ్ కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఇదిలా ఉండగా మరొకవైపు జూన్ 2వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది.

Advertisement

also read:బాలకృష్ణ రౌడీ ఇన్స్పెక్టర్ మూవీకి 34 ఏళ్లు.. ఆ రికార్డు సృష్టించిన ఏకైక హీరోగా గుర్తింపు!

ప్రీమియర్ బుకింగ్స్ లో సత్తా చాటుతున్న పెద్ది..

ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తుంది. విడుదలకు ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అతి తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో టికెట్లు అమ్ముడవడం విశేషం. జూన్ 3వ తేదీన అమెరికాలో గ్రాండ్ ప్రీమియర్స్ కి ప్లాన్ చేసిన ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 30 నిమిషాల్లోనే 50వేల డాలర్లకు పైగా ప్రీ సేల్స్ నమోదయ్యాయి. ఇక నాలుగు గంటలు పూర్తయ్యేలోపే లక్ష డాలర్ల మార్క్ ను అందుకోవడం విశేషం. అంతేకాదు అత్యంత వేగంగా లక్ష టికెట్స్ అమ్ముడుపోయిన చిత్రంగా పెద్ది అప్పుడే రికార్డు సృష్టించింది.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×