Peddi Records: గేమ్ చేంజర్ బొక్కబోర్లా పడటంతో ఎలాంటి సినిమా చేయాలనే డైలమాలోనే పెద్దికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చరణ్ .ఉప్పెన 100కోట్ల వసూల్లని కొల్లగొట్టినా చరణ్ ఇమేజ్ ని బుచ్చి మ్యాచ్ చేయగలడా అన్న అనుమానాలు.అయితే పెద్ది అనౌన్స్ అయినప్పుడు ఉన్న అనుమానాలని పటాపంచలు చేస్తూ అంచనాలు క్రమక్రమంగా పెరిగిపోయాయ్. ఇక అవే అంచనాలాని నిజం చేస్తూ బాక్సాఫీస్ వద్ద పెద్ది క్రియేట్ చేస్తున్న రికార్డులని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు ట్రేడ్ పండిట్స్.
జస్ట్ 24 గంటల్లోనే ఏకంగా లక్షకు పైగా
యస్ ..RRRసినిమాతో గ్లోబల్ స్టార్ ట్యాగ్ వేసుకున్న చరణ్ ఇపుడు ఆ ట్యాగ్ ని జస్టిఫై చేస్తూ ఓవర్ సీస్ మార్కెట్ ని షేక్ చేసే పనిలో పడ్డాడు.రీసెంట్ గా నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్ మొదలైన జస్ట్ 24 గంటల్లోనే ఏకంగా లక్షకు పైగా టికెట్లు అమ్ముడవ్వడమే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్.ఇక పవన్ కళ్యాణ్ ‘OG’ సెట్ చేసిన రికార్డ్స్ ని క్రాస్ చేస్తూ అమెరికాలో ఫాస్ట్ గా ఈ రికార్డ్ కొట్టిన ఇండియన్ సినిమాగా పెద్ది సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.ఇక సినిమా ప్రీ రిలీజ్ ఎల్బీ స్టేడియం లో జరగనున్న సంగతి తెల్సిందే .ఇక జూన్4న రిలీజ్ కానున్న ఈ సినిమాకి జూన్ 3నే పడే ప్రీమియర్స్ కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వెయిట్ చేస్తుండటంతో పెద్ది మరిన్ని రికార్డులని రీరైట్ చేసే ఛాన్స్ ఉందంటూ మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్.
ALSO READ :ఇన్‌స్టా ‘మహా ప్రక్షాళన’..ఒక్క రాత్రిలో కోట్లాది మంది మాయం.. సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు!
నవంబర్ 22, 2024న మైసూరులో ప్రారంభమైన సినిమా
ఇక సినిమా విషయానికి వస్తే నవంబర్ 22, 2024న మైసూరులో ప్రారంభమైన సినిమా షూట్ హైదరాబాద్ చుట్టు పక్కల వేసిన భారీ విలేజ్ సెట్లలో మెయిన్ సీక్వెన్స్ కంప్లీట్ చేసుకుంది.అలా మొత్తానికి మే 7, 2026 నాటికి ఈ సినిమా ఎడిటింగ్ వర్క్ (Lock) పూర్తయిందని, ఫైనల్ కాపీ అద్భుతంగా వచ్చిందని అఫీషియల్ గా మేకర్స్ ప్రకటించారు కూడా.అయితే మొదట్లో సినిమా మార్చి 27న వస్తుంది, ఆతర్వాత ఏప్రిల్ 30న విడుదల అవుతుందని వార్తలు వినిపించినప్పటికీ సినిమా క్వాలిటీ ఏ మాత్రం తగ్గకూడదన్న ఉద్దేశ్యంతో జూన్4 కి మార్చడం మనకి తెల్సిందే .ఇక అప్పటికల్లా ఐపీఎల్ సీజన్ కంప్లీట్ అవ్వడం కూడా పెద్దికి కలిసివచ్చేదే.
చరణ్ ఏ మేరకి సత్తా చాటుతాడో
ఇక సినిమా విషయానికి వస్తే శ్రీకాకుళం నేటివిటీతో పక్కా రా అండ్ రస్టిక్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకోవడం విశేషం. చరణ్ కి జోడీగా అచ్చియమ్మ పాత్రలో బాంబే బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, మరియు బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కీ రోల్స్ చేస్తున్న సంగతి తెల్సిందే.ఇక సినిమా ఆస్కార్ విన్నర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా ఇప్పటికే చికిరి, రై,రై పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి కూడా.వీటికి తోడు ఈ సినిమాలో వచ్చే స్పెషల్ సాంగ్ కి కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ స్టెప్పులేయడం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేదే.చూడాలి మరి రంగస్థలం తర్వాత మరోసారి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రారస్టిక్ గా కనిపించబోతున్న చరణ్ ఏ మేరకి సత్తా చాటుతాడో !
ALSO READ :కర్ణాటకలో ఓకే.. మరి తమిళనాడులో ఎందుకు కాదు? గవర్నర్‌ను నిలదీసిన హీరో విశాల్!