E-Paper
Advertisement

Congress : మంత్రుల తీరుపై సీఎం అసంతృప్తి.. కారణం ఇదేనా?

Congress : మంత్రుల తీరుపై సీఎం అసంతృప్తి.. కారణం ఇదేనా?
Advertisement

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు, కార్యక్రమాలు చేపట్టినా మైలేజ్ రావడం లేదని అధిష్టానం గుర్తించింది. ఓవైపు ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం లేకపోయినా అప్పులు తెచ్చి మరీ సీఎం రేవంత్ సంక్షేమం అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆరు గ్యారెంటీల్లో మహిళలకు రూ.2500 మినహా అన్నింటినీ సర్కారు అమలు చేసినా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు, జిల్లా ఇన్‌చార్జులు ఫెయిల్ అయ్యారని ప్రచారం జరుగుతోంది.అందుకే రాష్ట్ర మంత్రులపై సీఎం రేవంత్ నారాజ్‌గా ఉన్నట్టు సమాచారం.

నివేదికల రూపంలో..

రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు? మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపైనా సీఎం రేవంత్ నిఘా వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది.కిందిస్థాయిలో పథకాలు అందుతున్నాయా? ప్రజలు సంతోషంగా ఉన్నారా? రుణమాఫీ, రైతుభరోసా, పంట బోనస్ విషయంలో రైతులు సంతృప్తిగా ఉన్నారో లేదో అని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి మైలేజ్ తీసుకురావడం కోసం, ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రులను నియమించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ గత ఎన్నికల్లో కొందరు మంత్రుల పనితీరు బాగుందని నివేదికలు అందగా.. మరికొందరు సీఎం ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచడం లేదని తెలిసింది.

సమయం ఇచ్చినా..

Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తుండగా.. అందులో కొందరు పనితీరు మెరుగవ్వగా.. మరికొందరు మాత్రం ఏ మాత్రం పనితీరు కనబరచడం లేదని సీఎం రేవంత్ గుర్తించినట్టు సమాచారం. త్వరలోనే వారిపై చర్యలు తీసుకునేందుకు సీఎం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన సీఎం.. కేబినెట్ విస్తరణ, ప్రక్షాళన సమయంలో పనితీరు సరిగా కనబరచని వారికి ఉద్వాసన పలుకుతారని ప్రచారం జరుగుతోంది. మిగతా ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమై పార్టీలోని కొందరికి హింట్ సైతం ఇచ్చినట్టు సమాచారం.

పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ! కేటీఆర్ తిట్ల వ్యూహానికి చిక్క‌ని రేవంత్‌! రెచ్చ‌గొట్టే రాజ‌కీయ‌ ఉచ్చులో ఇరుక్కోని సీఎం..!

Advertisement

కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజల కోసం కాకుండా కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు సీఎంకు నివేదికలు సైతం అందిచనట్టు సమాచారం. ఈ క్రమంలోనే వారికి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన సీఎం.. త్వరలో వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పద్ధతి మార్చుకోకుంటే పార్టీ నుంచి సైతం వారిపై క్రమశిక్షణా చర్యలకు తీసుకునే చాన్స్ ఉన్నట్టు చర్చ జరుగుతున్నది.మొన్నటివరకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఫలితాల అనంతరం తమిళనాడు, కేరళలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సీఎం రేవంత్ హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిలపై సీఎం ఫోకస్ పెట్టనున్నారు. దీనికి తోడు పెండింగ్ ప్రాజెక్టులపైనా దృష్టి సారించనున్నారు. ఆ తర్వాత పనితీరు సరిగా లేని మంత్రులు, ఎమ్మెల్యేలపై యాక్షన్ ప్లాన్ సిద్దం చేయనున్నారని సమాచారం.

 

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×