E-Paper
Advertisement

Peddi Song: ‘పెద్ది’ సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Peddi Song: ‘పెద్ది’ సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
Advertisement

Peddi Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi Movie). బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం.. ‘ఉప్పెన’తో సంచలనాన్ని క్రియేట్ చేసిన బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ (Chikiri Chikiri Song) ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో తెలియంది కాదు. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ (Rai Rai Raa Raa)ను మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ ఎలా ఉందంటే..

Also Read- Niharika Konidela:పవర్ స్టార్ కూతురు.. పవర్ బిల్ కట్టలేరా.. నిహారికకి అదిరిపోయే పంచ్ వేసిన వంశీ..!

ఆలస్యమంటూ చిన్న క్లిప్

Advertisement

వాస్తవానికి ఈ సాంగ్ విడుదలను సోమవారం సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు విడుదల అంటూ ముహూర్తం ఫిక్స్ చేశారు. కానీ, కొద్దిగా ఆలస్యం అవుతుంది అంటూ బుచ్చిబాబు తన ఎక్స్ వేదికగా తెలియజేస్తూ.. అప్పటి వరకు ఈ క్లిప్ ఎంజాయ్ చేయండి అంటూ చిన్న క్లిప్ వదిలారు. ఈ క్లిప్‌తోనే సోషల్ మీడియా షేకయింది. ఇక కాస్త ఆలస్యంగా వచ్చినా, ఫ్యాన్స్ ఫుల్ ట్రీట్ ఇచ్చే కంటెంట్ ఇందులో ఉండటంతో.. వారంతా యమా ఎంజాయ్ చేస్తున్నారు. ‘‘మీ పనిలోనే ఉన్నా. ఈ రోజు ఎలాగైనా మనం సాంగ్ చూడాల్సిందే’’ అని బుచ్చిబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నట్టే.. కాసేపటికే సాంగ్‌ని వదిలారు.

Also Read- Vijay Deverakonda: విరోష్ వెడ్డింగ్ గిఫ్ట్, సొంత ఊరికి వరాల జల్లు.. విద్యార్థులకు గుడ్ న్యూస్!

పాట ఎలా ఉందంటే?

Advertisement

ఈ సాంగ్‌ని గమనిస్తే.. ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ఈ సాంగ్‌ని స్వరపరడమే కాకుండా.. ఆయనే స్వయంగా ఆలపించారు. ఆయన వాయిస్‌లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కోసం ఆయనే స్వయంగా పాడటంతో ఫ్యాన్స్‌ కూడా చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక ఈ పాట ‘చికిరి’ని మించి ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందులోనూ చాలా అర్థవంతమైన లిరిక్స్ ఈ పాటకు కుదిరాయి. ‘‘పాతేసు కోకోయ్ అలా.. నువ్ నిన్నే నీ లోపల, హే పాతికేళ్లకే.. నువ్ పాతపడిపోకురా..’’ వంటి మీనింగ్ ఫుల్ లిరిక్స్‌తో ఈ మధ్యకాలంలో పాట అయితే రాలేదనే చెప్పాలి. అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యం అందించారు. రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. మరోసారి ‘చిరుత’ అని అనిపించుకున్నారు. మరోసారి మ్యాసీ అవతార్‌లో రగ్గడ్ దుస్తుల్లో, ఊర మాస్‌గా కనిపించి ఆలరిస్తున్నారు. మొత్తంగా అయితే.. ‘చికిరి’ తరహాలోనే ఈ పాట కూడా రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అనేలా.. అన్ని కుదిరాయి. మరి ‘రై రై’ అంటూ ఏ రేంజ్‌లో సరికొత్త రికార్డులు నమోదవుతాయో చూడాలి.

Also Read- Allu Sirish: అల్లు శిరీష్ సినీ ప్రస్థానం బాలీవుడ్ తో మొదలైందా..ఆ సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా?

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×