E-Paper
Advertisement

Niharika Konidela:పవర్ స్టార్ కూతురు.. పవర్ బిల్ కట్టలేరా.. నిహారికకి అదిరిపోయే పంచ్ వేసిన వంశీ..!

Niharika Konidela:పవర్ స్టార్ కూతురు.. పవర్ బిల్ కట్టలేరా.. నిహారికకి అదిరిపోయే పంచ్ వేసిన వంశీ..!
Advertisement

Niharika Konidela: జీ తెలుగు ఛానల్‌లో ప్రసారమయ్యే ఆట కార్యక్రమంలో తాజాగా వచ్చిన ఒక స్కిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ స్కిట్‌లో నిహారిక కొణిదెల చేసిన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా నవ్విస్తోంది.

ఈ షో నుంచి విడుదలైన ప్రోమోలో నిహారిక నిర్మాత పాత్రలో కనిపించింది. సాధారణంగా నిర్మాతకు క్యాస్ట్ అంతా ఖర్చుల బిల్లులు ఇస్తారని తెలిసిందే. అదే విషయాన్ని ఆధారంగా చేసుకుని ఈ స్కిట్‌ను చాలా ఫన్నీగా రూపొందించారు. ముందుగా కావ్య తన బిల్లును ఇస్తుంది. ఆ బిల్లులో జ్యూస్‌లతో పాటు డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కూడా ఉన్నట్టు నిహారిక చదువుతుంది. వెంటనే కావ్య “చదవద్దు మామ్” అంటూ సరదాగా అడ్డుకుంటుంది. నీ ఖర్చులు అందరికీ తెలిసిపోతాయేమో అని అంటున్నావా అంటుంది హారిక అడగగానే వెంటనే కావ్య..నా బ్యూటీ సీక్రెట్ బయటపడిపోతుందని జోక్ వేస్తుంది.

Advertisement

ఆ తరువాత వంశీ రెండు లక్షల రూపాయల బిల్లును ఇస్తాడు. అంత పెద్ద మొత్తం ఎందుకు ఖర్చయ్యిందని నిహారిక అడగగా, ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టానని చెబుతాడు. అందరినీ “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా చూపించడానికి తీసుకెళ్లానని అంటాడు. అంత ఖర్చు ఎలా అయ్యిందంటే, గోవాకు తీసుకెళ్లి అక్కడ సినిమా చూపించానని.. నవ్వులు పూయిస్తాడు. చిరంజీవి సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్తానని చెప్పడం కూడా మరో హైలైట్.

Advertisement

ఇక అసలు పెద్ద పంచ్ వంశీ దగ్గరే వచ్చింది. వంశి అదేంటి నీ పవర్ బిల్ కూడా నాకే షేర్ చేశావు అని నిహారిక అదగగా.. పవర్ స్టార్ కూతురు పవర్ బిల్ కట్టలేరా అంటూ వంశీ వేసిన పంచ్ బాగా తేలింది. ఈ డైలాగ్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇక్కడ పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ అనే విషయం తెలిసిందే.

ఆ తర్వాత విష్ణు ప్రియ మేకప్‌కి లక్ష రూపాయల బిల్లు ఇస్తుంది. మేకప్ కి ఏకంగా లక్ష రూపాయలా అని నిహారిక అడగగానే.. అక్కడ ఉన్న విష్ణు ప్రియ..ఆట షో రేటింగ్ మొత్తం తన అందంపైనే ఆధారపడి ఉందని చెబుతుంది.. దీనిపై సుధీర్ “అంత మేకప్ వేసినా ఇలానే ఉన్నావా?” అంటూ వేసిన పంచ్ కూడా నవ్వులు తెప్పించింది.

నిహారిక నిర్మాతగా చేసిన ఈ స్కిట్ కామెడీ, టైమింగ్, డైలాగ్స్‌తో ప్రేక్షకులను బాగా అలరించింది. అందుకే ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఇక ప్రస్తుతం నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తోన్న రాకాస సినిమా త్వరలోనే విరుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

ALSO READ: Vijay Deverakonda: విరోష్ వెడ్డింగ్ గిఫ్ట్, సొంత ఊరికి వరాల జల్లు.. విద్యార్థులకు గుడ్ న్యూస్!

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×