E-Paper
Advertisement

India Nuclear: బిల్డప్ ఎక్కువ.. బాంబులు తక్కువ.. అణ్వాయుధాల మోహరింపులో పడిపోయిన పాకిస్తాన్..!

India Nuclear: బిల్డప్ ఎక్కువ.. బాంబులు తక్కువ.. అణ్వాయుధాల మోహరింపులో పడిపోయిన పాకిస్తాన్..!
Advertisement

India Nuclear: అణ్వాయుధాలు సాధారణంగా ఆపరేషనల్‌గా రెడీగా ఉండవు. ది కోర్ అణ్వాయుధానికి గుండెకాయ లాంటిది. ఇందులో యురేనియం ఉంటుంది. కోర్ చుట్టూ కన్వెన్షనల్ ఎక్స్‌ప్లోజివ్స్ అమర్చుతారు. అంటే ఒక దేశం అణుబాంబు పేల్చాలంటే దాన్ని రెడీ చేసేందుకు క్షిపణిపై లేదంటే అణు జలాంతర్గామిలో పెట్టడానికి కొన్ని గంటల నుంచి రోజుల సమయం పడుతుంది. అంటే ప్రత్యర్థి దాడి చేస్తే వెంటనే ప్రతిదాడి చేసే వీలు ఉండదు. భారత్ ఇన్నాళ్లూ తన అణు విధానంలో డీ మేటెడ్ వ్యూహాన్ని ఫాలో అవుతూ వచ్చింది. అంటే అణు కోర్ ఒకచోట, క్షిపణి మరొక చోట ఉంటాయి. కానీ ఇప్పుడు యుద్ధ తంత్రాలపై భారత్ గేర్ మార్చి స్పీడ్ పెంచుతోంది. న్యూక్లియర్ వార్ హెడ్స్ దుమ్ము దులుపుతోంది. ఇక దేనికైనా రెడీ అంటూ ప్రపంచానికి సిగ్నల్స్ పంపుతోంది. తాజాగా సిప్రీ 2026 రిపోర్ట్ లో ఇదే విషయంపై క్లారిటీ వచ్చింది.

సిప్రి రిపోర్ట్ ప్రకారం..

తాజాగా భారత్ తన అణు వ్యూహంలో కీలక మార్పు చేస్తూ, 12 అణు వార్‌హెడ్‌లను క్షిపణులకు లింక్ చేసి ఆపరేషనల్లీ డిప్లాయ్డ్ లిస్టులో చేర్చింది. ఈ చర్య చైనా నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి, ఆకాశం, భూమి, సముద్రం నుంచి ప్రయోగించేలా న్యూక్లియర్ ట్రయాడ్ రెడీ చేస్తోంది. అలాగే సెకండ్ స్ట్రైక్ కేపబులిటీని బలోపేతం చేయడానికి భారత్ ఈ చర్య తీసుకుని ఉండొచ్చని అంటున్నారు. సిప్రి రిపోర్ట్ ప్రకారం ఇండియా తన న్యూక్లియర్ పాలసీలో ఎలాంటి మార్పును చెప్పకపోయినా, ఈ పరిణామం దేశ వ్యూహాత్మక బలగాలలో ఉన్నత స్థాయి సంసిద్ధతను సూచిస్తోంది. ఆపరేషనల్ రెడీనెస్ ను ఈ మధ్య ఛాలెంజ్ గా తీసుకుంది భారత్. అందుకే ఇలా న్యూక్లియర్ వార్ హెడ్స్ ను మోహరించిందా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. మొత్తం అణ్వాయుధాల సంఖ్యను 180 నుంచి 190కి పెంచిన భారత్.., పాకిస్తాన్ కంటే ముందంజలో ఉంటూనే, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు రెడీగా ఉంటోందన్న చర్చ జరుగుతోంది.

Advertisement

Also Read: స్టూడెంట్స్ స్పెషల్.. రూ.15 వేల బడ్జెట్లో.. అధునాతన స్మార్ట్ ఫోన్లు ఇవే!

వెపన్స్‌తో రెడీ అంయిన చైనా..

అణ్వస్త్రాల ప్రయోగ సన్నద్ధతపై ఇప్పటివరకూ సంయమనం పాటిస్తూ వచ్చిన భారత్‌ ఆ విధానానికి స్వస్తి పలికినట్లే కనిపిస్తోంది. ప్రయోగానికి రెడీగా ఉండేలా 12 అణు వార్‌హెడ్లను తొలిసారిగా మోహరించిందని అంతర్జాతీయ సంస్థ స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజా రిపోర్ట్ లో చెప్పడం కీలకంగా మారింది. ప్రత్యర్థిపై తాను మొదట అణుదాడికి దిగకూడదన్నది భారత విధానం. తన భూభాగంపై అణ్వస్త్ర ప్రయోగం జరిగితే.. ప్రతీకారంగా మాత్రమే అదే తరహాలో రిప్లై ఇవ్వాలని రూల్ పెట్టుకుంది. దశాబ్దాలుగా భారత్‌.. అణు వార్‌హెడ్లను, వాటిని లక్ష్యాలపైకి చేరవేసే లాంఛర్‌ వ్యవస్థలను వేర్వేరుగా భద్రపరుస్తోంది. కానీ మారుతున్న పరిస్థితుల్లో అన్నిటినీ ఒక్క దగ్గరకు చేర్చి ఏ క్షణమైనా ప్రయోగించేలా రెడీ చేస్తోంది. కొన్ని వార్‌హెడ్లను SSBN శ్రేణి న్యూక్లియర్ సబ్ మెరైన్స్ లో భారత్‌ మోహరించినట్లు సిప్రీ తెలిపింది. ఈ సబ్‌మెరైన్లు సముద్రంలో గస్తీ కూడా తిరుగుతున్నట్లు రిపోర్ట్ చెబుతోంది. మరోవైపు పాక్‌ ఈ తరహాలో అణ్వాయుధాల మోహరింపును చేపట్టలేదని, చైనా మాత్రం 24 వెపన్స్ ను రెడీగా ఉంచిందని సిప్రీ ఇయర్ బుక్ 2026లో చెప్పింది.

చైనా వద్ద 620 అణ్వాయుధాలు

Advertisement

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు బాగా లేవు. యుద్ధాల తీవ్రత పెరుగుతోంది. అందుకే చాలా దేశాలు తమ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి భారత్‌ 190 అణ్వాయుధాలను సమకూర్చుకుంది. గతేడాది కంటే పది ఎక్కువ. పాకిస్థాన్‌ కంటే భారత్‌ వద్ద 20 న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువగా ఉన్నాయి. చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే బీజింగ్‌ 20 అణు వార్‌హెడ్‌లను పెంచుకుంది. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలున్న దేశాలుగా రష్యా, అమెరికా నిలిచాయి. రష్యా వద్ద 5,420, అమెరికా దగ్గర 5,042 అణు వార్‌హెడ్లు ఉన్నాయని సిప్రి తెలిపింది. ఓవరాల్ గా 9 అణ్వాయుధ దేశాల్లో మొత్తం 12,187 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక రక్షణ వ్యయం ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ఐదో స్థానంలో ఉంది. 2025లో భారత రక్షణ వ్యయం 92.1 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు సిప్రి నివేదిక తెలిపింది.

Also Read: జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

Related News

ఫ్లాప్ షో నుంచి హిస్టారికల్ విక్టరీ దాకా.. 37 రోజుల్లో ఢిల్లీని ఊపేసిన జెన్-జీ తుఫాన్!

ఒరేయ్‌.. నీనింకా చావ‌లేదురా.. అప్పుడే చంపేయ‌కుర్రి…! మీ బ్రే..కింగుల అత్యుత్సాహం చావ..!

బొద్దింక గర్జన-శాశ్వతమేనా ?

జంత‌ర్ మంత‌ర్ టు పార్ల‌మెంట్‌.. తెలంగాణ గ‌ల్లీ నుంచి ఢిల్లీ జెన్‌-జీకి ప్ర‌తిపాద‌న‌..!

కాక్రోచులకు అండగా కాంగ్రెస్‌.. విద్యార్థి ఉద్య‌మాల‌కు వెన్నుద‌న్నుగా ఉంటామంటూ..

ఎప్పుడు త‌గ్గాలో తెలుసుకున్నాడు.. కానీ నెగ్గ‌లేదు! అభిమానుల‌కు మింగుడు ప‌డ‌ని మోడీ నిర్ణ‌యం..

హ‌మ్మ‌య్య‌.. ఊపిరిపీల్చుకున్న టాలీవుడ్‌.. మ‌న సెల‌బ్రిటీలు తేలుకుట్టిన దొంగ‌లు..!

బొద్దింక‌ల చేత‌జిక్కి … చేతులు కాలాక ఆకులు.. బద్నాం చేసిన పంతం..!

Big Stories

Advertisement
×