E-Paper
Advertisement

వారణాసి’ తర్వాత బుచ్చిబాబుతో మహేష్ బాబు సినిమా?.. అదయ్యేపనేనా?

వారణాసి’ తర్వాత బుచ్చిబాబుతో మహేష్ బాబు సినిమా?.. అదయ్యేపనేనా?
Advertisement

Mahesh Babu–Buchi Babu: టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే రచ్చ, ఒకటే చర్చ. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్‌గా మారిపోయిన బుచ్చిబాబు సన, రీసెంట్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో చేసిన ‘పెద్ది’ (RC16) సినిమాతో థియేటర్లలో కలెక్షన్ల సునామి సృష్టిస్తున్నారు. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు క్యారెక్టర్‌ను మించిపోయేలా చరణ్‌ను రగ్గడ్ లుక్‌లో, ఊరమాస్ అవతారంలో చూపించి థియేటర్లను షేక్ చేశారు.

కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసులు కురిపిస్తున్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా సినిమాపై వస్తున్న కొన్ని ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా సినిమా సెకండాఫ్‌లో సీన్లు ల్యాగ్ అవడం, ఉప్పెన  సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌ను పీక్స్‌లో చూపించిన బుచ్చిబాబు, ఈసారి జాన్వీ కపూర్ పాత్రను అంత బలంగా డిజైన్ చేయలేకపోయారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.ఈ నెగెటివిటీ అంతా ఇప్పుడు బుచ్చిబాబు తదుపరి ప్రాజెక్టుపై పడటం టాలీవుడ్ సర్కిల్స్‌లో పెద్ద కలకలమే రేపుతోంది.

Advertisement

also read :రణ్‌వీర్ సింగ్ బాక్సాఫీస్ సునామీ.. ‘పుష్ప-2’ రికార్డులను తిరగరాసిన ‘దురంధర్-2’

కాంబినేషన్ సెట్ అవ్వడం ఇంపాజిబుల్?

బుచ్చిబాబు తన కెరీర్‌లో హ్యాట్రిక్ మూవీని సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నారనే లీకులు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా బుచ్చిబాబే మహేష్ బాబుతో చర్చలు జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కథలని, డైరెక్టర్లని ఏరి కోరి మరీ సెలెక్ట్ చేసుకునే  ట్రాక్ రికార్డ్‌ మహేష్ బాబు, ఇప్పుడు ‘పెద్ది’ సినిమాపై వస్తున్న ఈ డివైడ్ టాక్స్  మరియు ట్రోల్స్ చూశాక అసలు బుచ్చిబాబుతో సినిమా చేస్తారా అనే అనుమానాలు ఫిలిమ్ సర్కిల్స్ లో గట్టిగానే రైజ్ అవుతున్నాయ్.ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే అసలు ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం ఇంపాజిబుల్ అంటూ ఏకిపారేస్తున్నారు.

గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్

Advertisement

ప్రస్తుతం మహేష్ బాబు గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో చేయబోయే అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా (SSMB29) ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఎంతో బిజీగా ఉన్నారు. రాజమౌళి సినిమా అంటే ఎలా లేదన్నా రెండు మూడు సంవత్సరాల సమయం పడుతుంది. ఈ గ్యాప్‌లోనే బుచ్చిబాబు మహేష్ బాబును ఒప్పించి లైన్ క్లియర్ చేసుకోవాలని చూశారు. గతంలో సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చకనే మహేష్ బాబు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసి అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు సినిమా చేశారు.

also read :తొలిసారి పెదవి విప్పిన మెగా కూతురు శ్రీజ.. ఎమోషనల్ వీడియో వైరల్!

అంతటి సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు విషయంలో మహేష్ బాబు అంత ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్.మహేష్ బాబు ఎప్పుడూ పక్కా బౌండ్ స్క్రిప్ట్, ఎమోషన్స్ పర్‌ఫెక్ట్‌గా కుదిరితేనే ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారని స్పెషల్ గా చెప్పక్కర్లేదు కూడా.

ఈ కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్తుందో లేదో !

పెద్ది సినిమాలో ఫస్ట్ హాఫ్ అదిరిపోయినా, సెకండాఫ్ మరియు హీరోయిన్ క్యారెక్టరైజేషన్ విషయంలో బుచ్చిబాబు తడబడ్డారనే టాక్ నడుస్తుండటంతో, మహేష్ బాబు ఇప్పుడు మరింత అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ లోపాలను సరిదిద్దుకుని, స్క్రిప్ట్‌ను వంద శాతం పకడ్బందీగా సిద్ధం చేసుకుంటే తప్ప మహేష్ బాబు నుంచి పిలుపు రావడం కష్టమేనని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట..

ఒకవేళ బుచ్చిబాబు ఈ రియాక్షన్స్ ని  ఛాలెంజ్‌గా తీసుకుని, మహేష్ బాబు ఇమేజ్‌కు తగ్గట్టుగా మైండ్ బ్లోయింగ్ కథను రెడీ చేస్తే ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కడం ఖాయం. లేదంటే మాత్రం ఈ కాంబో కేవలం రూమర్స్ కే పరిమితమయ్యేలా ఉంది. చూడాలి ఫ్యూచర్లో ఈ కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్తుందో లేదో !

also read :సాక్షి శివానంద్‌కు ఏమైంది? సినిమాలు వదిలి ఎందుకు పారిపోయింది? ఆ నిర్మాతే కారణమా?

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×