Peddi Shooting: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan)హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం పెద్ది(Peddi). ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా 2026 మార్చి 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో షూటింగ్ పనులను వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ను సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా ఢిల్లీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా పోయెటిక్ గా లీనమయ్యిపోయే సీన్స్ ని తాము తీసినట్టుగా తెలిపారు. అలాగే రామ్ చరణ్ ఎప్పటిలానే తన బెస్ట్ ఇచ్చారు అంటూ దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ అప్డేట్ తెలియచేశారు.
ఇలా ఈ సినిమా ఢిల్లీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయిన నేపథ్యంలో తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. తదుపరి షెడ్యూల్ న్యూ ఇయర్ పూర్తి అయిన అనంతరం ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ గ్రామీణ యువకుడిగా డి గ్లామర్ పాత్రలో కనిపించబోతున్నట్టు ఇదివరకే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే స్పష్టమవుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
గ్రామీణ క్రీడా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మొత్తం క్రికెట్ నేపథ్యంలో ఉండబోతుందని తెలుస్తుంది . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన చికిరి సాంగ్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగల్ విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం వెల్లడించారు. అతి త్వరలోనే సెకండ్ సింగిల్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో పెద్ది సినిమా పైనే మెగా అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు . ఉప్పెన సినిమా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బుచ్చిబాబు రామ్ చరణ్ చేయబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి సినిమాని డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ గురించి అధికారక ప్రకటన కూడా వెలబడింది. 2026 ఏప్రిల్ లేదా మే నెల నుంచి సుకుమార్ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని ఇటీవల చిత్ర నిర్మాతలు కూడా వెల్లడించారు.
Also Read: Duvvada srinivas madhuri: శివాజీకి సపొర్ట్‌గా దువ్వాడ శ్రీనివాస్ – మాధురి… అస్సలు తప్పు కాదు అంటూ