E-Paper
Advertisement

Navi Mumbai Airport : అందుబాటులోకి నవీ ముంబై ఎయిర్‌ పోర్ట్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Navi Mumbai Airport : అందుబాటులోకి నవీ ముంబై ఎయిర్‌ పోర్ట్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!
Advertisement

Navi Mumbai Airport Open: భారతీయ విమానరంగంలో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. కంప్లీట్ డిజిటల్ ఆపరేషన్స్ తో నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి ఈ ఎయిర్ పోర్టులో కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇది ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌కు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం, అదానీ గ్రూప్,  CIDCO కలిసి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో నిర్మాణం జరుపుకుంది. మొత్తం 1,160 హెక్టార్లలో నిర్మించబడిన ఈ విమానాశ్రయం దేశంలోనే అత్యాధునిక విమానాశ్రయాలలో ఒకటిగా నిలువబోతోంది.

అక్టోబర్ 8న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం

నిజానికి ఈ ఎయిర్ పోర్టు అక్టోబర్ 8, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించారు. కమర్షియల్ ఆపరేషన్స్ ఇవాళ్టి నుంచి మొదలయ్యాయి. తొలి రోజు సుమారు 30 ఫ్లైట్స్.. 15 అరైవల్స్, 15 డిపార్చర్స్ నడవనున్నాయి.  గంటకు 10 మూవ్‌మెంట్స్ కొనసాగనున్నాయి. తొలి అరైవల్ IndiGo ఫ్లైట్ 6E460 (బెంగళూరు నుంచి) ఉదయం 8:00 గంటలకు ల్యాండ్ అయ్యింది.  వాటర్ క్యానన్ సల్యూట్‌ తో స్వాగతం పలికారు ఎయిర్ పోర్ట్ అధికారులు. తొలి డిపార్చర్ IndiGo ఫ్లైట్ 6E882 (హైదరాబాద్‌కు) ఉదయం 8:40 గంటలకు బయలుదేరింది. ఈ ఎయిర్ పోర్టు నుంచి IndiGo, Air India Express, Akasa Air, Star Air ఆపరేషన్స్ కొనసాగించనున్నాయి. తొలి దశలో ఇక్కడి నుంచి బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో, గోవా, జైపూర్, నాగ్‌పూర్, కోచిన్, మంగళూరుకు రాకపోకలు కొనసాగించనున్నాయి.  ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆపరేషన్స్ కొనసాగుతాయి. ఫిబ్రవరి 2026 నుంచి 24 గంటల ఆపరేషన్స్, 34 డైలీ డిపార్చర్స్‌ కు పెంచుతారు.  ఫస్ట్ ఫేజ్‌లో ఏడాదికి 20 మిలియన్ ప్యాసింజర్స్ రాకపోకలు కొనసాగించేలా ఏర్పాటు చేశారు.  పూర్తి అయితే 90 మిలియన్ ప్యాసింజర్స్ + కార్గో సేవలు కొనసాగనున్నాయి.

నవీ ముంబై ఎయిర్ పోర్ట్ ప్రత్యేకతలు

Advertisement

⦿ దేశంలో మొదటి పూర్తి డిజిటల్ విమానాశ్రయం. ఆన్‌లైన్ బ్యాగేజ్ డ్రాప్, ప్రీ బుక్ పార్కింగ్, AI-ఆధారిత ఆపరేషన్స్‌తో వేగవంతమైన ప్రయాణం అందిస్తుంది.

⦿ విశాల సామర్థ్యం, భవిష్యత్ విస్తరణ ఉంటుంది.  ఫేజ్1లో 20 మిలియన్ ప్యాసింజర్లు, 4 టెర్మినల్స్, 2 రన్‌వేలతో 155 మిలియన్ల వరకు ప్రయాణీకుల రాకపోకలు కొనసాగుతాయి.

Advertisement

⦿ అన్ని వాతావరణాలకు అధునాతన ల్యాండింగ్ సిస్టమ్ ఉంటుంది. మంచు, వర్షం, తక్కువ విజిబిలిటీలో సురక్షిత ల్యాండింగ్ అవకాశం ఉంటుంది.

⦿ మల్టీ మోడల్ ట్రాన్స్‌ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. ఎక్స్‌ ప్రెస్‌ వేలు, మెట్రో, రైలు, వాటర్‌ వేలతో అనుసంధానం కలిగి ఉంటుంది. దేశంలో మొదటి పెద్ద అవియేషన్ హబ్.

⦿ ప్యాసింజర్ ఫ్రెండ్లీ ఫెసిలిటీలు ఉంటాయి. 4 గేట్‌లు, 88 చెక్ ఇన్ కౌంటర్స్,  ఫుడ్ హాల్స్‌ తో గేట్ డెలివరీ ఉంటుంది.

⦿ లోటస్ ఇన్‌స్పైర్డ్ డిజైన్, సస్టైనబుల్ ఫీచర్స్, మాడర్న్ టెర్మినల్ లాంటి ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.

⦿ ఈ విమానాశ్రయంతో భారీగా ఉపాధిక కల్పన జరగనుంది.ఇది రూ. 19,650 కోట్ల ఖర్చుతో Adani-CIDCO PPPలో నిర్మించబడింది. ఏవియేషన్, లాజిస్టిక్స్, ITలో 2 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.

⦿ఈ ఎయిర్‌పోర్ట్ ముంబై ఎయిర్‌పోర్ట్ (BOM)పై ఒత్తిడిని తగ్గిస్తుంది.

Read Also: ఇండిగో వివాదం.. ఇంతకీ దాని యజమాని ఎవరు? ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?

Related News

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×