E-Paper
Advertisement

పెద్ది షూట్ అప్డేట్.. కిరాక్ ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్..

పెద్ది షూట్ అప్డేట్.. కిరాక్ ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్..
Advertisement

Peddi Movie: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పెద్ది(Peddi). గ్రామీణ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడుతూ వస్తుంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని మార్చి 27వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం భావించారు కానీ షూటింగ్ పూర్తికాని నేపథ్యంలో తిరిగి ఏప్రిల్ 30వ తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు.

బుచ్చి బాబుతో రామ్ చరణ్ సెల్ఫీ..

ఈ సినిమా షూటింగ్ పూర్తికాని నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ నుంచి వాయిదా పడుతూ జూన్ నెలలో విడుదల కాబోతుందని చిత్ర బృందం అధికారికంగా తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిందని కేవలం ఒక సాంగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా రామ్ చరణ్(Ramcharan) పెద్ది సినిమా సెట్స్ నుంచి డైరెక్టర్ బుచ్చి బాబుతో కలిసి దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ అవుతుంది.

ఆరు రోజులలో షూటింగ్ పూర్తి..

Advertisement

ఇక ఈ ఫోటోని పెద్ది చిత్ర నిర్మాతలు వృద్ధి సినిమాస్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. పెద్ద సినిమా షూటింగ్ మొత్తం మరొక ఆరు రోజులలో పూర్తి కాబోతుందని, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ నెలలో విడుదల కాబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ ఆరు రోజులలో ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తి కాబోతుందని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా ఈ సాంగ్ కోసం హీరోయిన్ ఎంపిక కాని నేపథ్యంలో ఆలస్యం అవుతుంది.

Advertisement

పెద్ది స్పెషల్ సాంగ్ కోసం చిత్ర నిర్మాతలు పలువురు హీరోయిన్లను సంప్రదించినప్పటికీ ఎవరు ఫైనల్ కాలేదని సమాచారం. స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే, మృణాళ్ ఠాకూర్, మానస వారణాసి వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా మరో నటి సంయుక్త మీనన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ స్పెషల్ సాంగ్ కోసం దాదాపు కన్ఫర్మ అయ్యారని, చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ చిత్ర బృందం మాత్రం ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు. ఈ సినిమాలో రాంచరణ్ జోడిగా నటి జాన్వీ కపూర్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన సాంగ్స్, గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వటమే కాకుండా సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి.

Also Read: కొరటాల శివతో బాలయ్య సినిమా కన్ఫర్మ్..పూర్తి డీటెయిల్స్ ఇవే!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×