E-Paper
Advertisement

Ram Charan : ఛాంపియన్ సినిమా మగధీర అంత హిట్ అవ్వాలి

Ram Charan : ఛాంపియన్ సినిమా మగధీర అంత హిట్ అవ్వాలి
Advertisement

Ram Charan : ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి బ్యానర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించడం మాత్రమే కాకుండా చాలామంది స్టార్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ బ్యానర్ నుంచి విడుదలైన చివరి చిత్రం కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించి దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి రాబోతున్న సినిమా ఛాంపియన్. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్ మేక నటిస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తున్న తరుణంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రాంచరణ్ హాజరయ్యారు. చరణ్ తన స్పీచ్తో మరోసారి ఆకట్టుకున్నారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ

Advertisement

ఒకరికి స్పెషల్ గా నేను థాంక్యూ చెప్పుకోవాలి. నేను మనసు విప్పి ఆయనకు మనస్ఫూర్తిగా థాంక్యూ చెప్పానో లేదో నాకు తెలియదు. బహుశా చెప్పే ఉంటాను. చాలామంది హీరోలకి ఎన్టీఆర్ కు స్టూడెంట్ నెంబర్ వన్, అల్లు అర్జున్ కు గంగోత్రి, మహేష్ బాబుకి రాజ్ కుమారుడు, నాకు చిరుత. వీటన్నిటికీ మోస్ట్ కామన్ పర్సన్ మా దత్తు గారికి, అలానే వైజయంతి బ్యానర్ కి మరోసారి థాంక్యూ చెబుతున్నాను.

మేమందరం మొదలు పెట్టినప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ ఉండే ఉంటారు. కానీ అందరికన్నా ముందు వచ్చి మమ్మల్ని ధైర్యంగా, అప్పటికి మేము యాక్టింగ్ ఎలా చేస్తామో తెలియదు, మమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియదు అటువంటి టైంలో ఒకే ఒక వ్యక్తి వచ్చి ఇంతమంది స్టార్స్ ని యాక్టర్లుగా మలిచారు. మాకు నిజంగా ఒక మెమొరబుల్ జర్నీ ఇచ్చారు. అందుకనే దత్తుగారికి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ థాంక్యూ సో మచ్. అదే త్రోవలో రోషన్ కూడా ఈరోజు ఛాంపియన్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాకి రోషన్ కి ఫస్ట్ సక్సెస్ రావాలి అని కోరుకుంటున్నాను.

రోషన్ నాకు చిన్నప్పుడు నుంచి తెలుసు 

Advertisement

రోషన్ చాలా చాలా అందంగా ఉన్నాడు ఒక యూరోపియన్ హీరోలా అనిపిస్తున్నాడు. నేను ఇందాకే శ్రీకాంత్ గారితో చెబుతూ ఉన్నాను ఏం అనుకోకు అన్నయ్య నువ్వు కొంచెం రౌండ్ గా ఉంటావు మనోడు మాత్రం షార్ప్ గా ఎలా వచ్చాడు అని. శ్రీకాంత్ అన్నయ్య, ఊహగారు మంచి మనసు ఉన్న వ్యక్తులు. నాకు మగధీర సెకండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో నీకు ఛాంపియన్ సినిమా అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.

Also Read: Pawan Kalyan: సుజీత్ కు పవన్ కళ్యాణ్ కారు ఇవ్వడానికి ఇదే కారణం, సినిమా కోసం సుజీత్ అంతకు తెగించాడా?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×