E-Paper
Advertisement

‘పెద్ది’ తర్వాత మెగా పవర్ స్టార్‌కు సర్జరీ.. సుకుమార్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?

‘పెద్ది’ తర్వాత మెగా పవర్ స్టార్‌కు సర్జరీ.. సుకుమార్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?
Advertisement

Ram Charan Surgery Buzz: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్, ఫ్యాన్ బేస్ వేరు. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అలాంటి కాంబోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్. టాలీవుడ్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన రంగస్థలం సినిమాతో 2018లో వీరిద్దరూ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. చిట్టిబాబుగా చరణ్ నటన, ఉప్పెనలాంటి సుకుమార్ టేకింగ్ కలిసి సిల్వర్ స్క్రీన్ పై ఒక మ్యాజిక్ చేసేశాయ్ .

అప్పటినుంచి ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేక్షకుడు కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. రామ్ చరణ్ వరుసగా RRR, ఆచార్య, గేమ్ ఛేంజర్ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉండటం, సుకుమార్ పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో బిజీ అవ్వడంతో వీరి కాంబో కుదరని పరిస్థితి.

 సర్జరీ పోస్ట్ పోనే చేసుకున్న చరణ్ 

Advertisement

భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ప్రాణం పెట్టి పనిచేశాడనే చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో వచ్చే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రియల్ రెజ్లర్లతో చరణ్ ఫైట్ చేశాడు. ఈ క్రమంలోనే ఆయన చేతికి తీవ్రమైన గాయమైంది. ఆ సమయంలోనే పరీక్షించిన వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని సూచించినప్పటికీ, సినిమాపై ఉన్న బాధ్యతతో పెద్ది ప్రమోషన్స్ కోసం చరణ్ తన సర్జరీని వాయిదా వేసుకున్నాడు. సినిమాను ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు గాయాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని తన డెడికేషన్‌ను చాటుకున్నాడు.

ఆ తర్వాతే సుకుమార్ తో సినిమా 

ప్రస్తుతం పెద్ది ప్రమోషన్స్ ముగియడంతో, మెగా పవర్ స్టార్ తన చేతి సర్జరీకి సిద్ధమయ్యాడనేది తాజా సమాచారం. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సర్జరీ అనంతరం రామ్ చరణ్‌కు కనీసం మూడు నెలల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు గట్టిగా సూచించినట్లు తెలుస్తోంది. ఈ అనుకోని సంఘటనతో చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

also read :ఆ సీన్లు తీసేయాల్సిందే.. ‘పెద్ది’ మేకర్స్‌కు ఆదివాసీల అల్టిమేటం.. థియేటర్లు బంద్ చేస్తామంటూ హెచ్చరిక!

పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటేనే సుకుమార్ లాంటి దర్శకుడి సినిమాలో వంద శాతం ఎఫర్ట్స్ పెట్టగలమని భావించిన చరణ్, కోలుకోవడానికి కొంత సమయం కావాలని సుకుమార్‌ను కోరినట్లు ఇండస్ట్రీ టాక్. సుకుమార్ స్క్రిప్ట్ అంటేనే భారీ యాక్షన్ ఎపిసోడ్స్, కఠినమైన షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి, చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని అభిమానులు కూడా భావిస్తున్నారు.

వార్తలపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో !

ఈ మూడు నెలల గ్యాప్ ని దర్శకుడు సుకుమార్ కూడా వృథా చేయదలచుకోలేదట. చరణ్ కోసం సిద్ధం చేసిన స్క్రిప్ట్‌ను మరింత పదును పెట్టే పనిలో పడ్డట్టు సమాచారం. రంగస్థలం సినిమాను మించేలా, అంతకంటే పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో ఈ కొత్త కథను సుకుమార్ మలుస్తున్నట్లు వినిపిస్తుంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా మొదలు అవ్వాలి.ది, కానీ చరణ్ హెల్త్ కండిషన్ దృష్ట్యా ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సుకుమార్ గతంలో మహేష్ బాబుతో నేనొక్కడినే, ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్‌తో ఆర్య సిరీస్ మరియు పుష్ప సిరీస్ వంటి మైల్‌స్టోన్ సినిమాలు తీశారు. రామ్ చరణ్ కూడా మగధీర, ధ్రువ, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలతో తన నటనను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. కాబట్టి వీరిద్దరి కలయికలో రాబోయే ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని
తాకుతున్నాయి. చూడాలి మరి సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో !

also read :గూస్‌బంప్స్ తెప్పిస్తున్న విజయ్ సేతుపతి డైలాగ్స్.. పూరి జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ టీజర్ టాక్!

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×