E-Paper
Advertisement

ఆ సీన్లు తీసేయాల్సిందే.. ‘పెద్ది’ మేకర్స్‌కు ఆదివాసీల అల్టిమేటం.. థియేటర్లు బంద్ చేస్తామంటూ హెచ్చరిక!

ఆ సీన్లు తీసేయాల్సిందే.. ‘పెద్ది’ మేకర్స్‌కు ఆదివాసీల అల్టిమేటం.. థియేటర్లు బంద్ చేస్తామంటూ హెచ్చరిక!
Advertisement

Peddi Controversy : ఒకవైపు కలెక్షన్లు …మరో వైపు కాంట్రవర్సీలు ..ఇదీ ఇప్పుడు పెద్ది పరిస్థితి.అవును.. సినిమా 230 కోట్లకి పైగా కొల్లగొట్టిందని మేకర్స్ అఫీషియల్ గా పోస్టర్స్ వదిలి ఆనందాన్ని తెలుపుతుంటే మరో వైపు సినిమాలో జాన్వీ గ్లామర్ డోస్ పెరిగిందని,అదే సినిమాకి అతి పెద్ద మైనస్ అని ఇలా నెగెటివ్ కామెంట్స్ కూడా సినిమాని చుట్టుముడుతున్నాయ్. ఇక ఇవిలా ఉండగా తాజాగా దీనికి తోడు సినిమాని మరో కాంట్రవర్సీ కమ్మేసింది.

యస్… సినిమాలో వచ్చిన కొన్ని సీన్స్ తమ మనోభావాలను తీవ్రంగా హార్ట్ చేసాయంటూ ఆదివాసీ సంఘాలు రోడ్డెక్కాయి. ఈ చిత్రంలో గిరిజనులను, వారి సంస్కృతిని అవహేళన చేసేలా, సమాజంలో వారిని తక్కువ చేసి చూపేలా కొన్ని సన్నివేశాలను పొందుపరిచారని గిరిజన హక్కుల పోరాట సమితి ప్రతినిధులు మండిపడుతున్నారు. కళాకారుల స్వేచ్ఛను గౌరవిస్తాం కానీ, అది ఒక వర్గాన్ని కించపరిచేలా ఉండకూడదంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement


ఈ వివాదం కేవలం సోషల్ మీడియా రచ్చకే పరిమితం కాలేదు. ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను స్వయంగా కలిసి అధికారికంగా ఫిర్యాదులు సమర్పించారు. వివాదాస్పద సన్నివేశాలను సినిమా నుండి తక్షణమే తొలగించాలని, లేనిపక్షంలో థియేటర్ల వద్ద ప్రదర్శనలను అడ్డుకుంటామని, సినిమా విడుదలను నిలిపివేయాలని హెచ్చరించారు.
also read :NBK 111.. థియేటర్లలో స్పీకర్లు పగిలిపోవడం ఖాయం.. బాలయ్య సినిమాపై తమన్ ఊరమాస్ అప్‌డేట్!

చిత్ర పరిశ్రమను షేక్ చేసిన వివాదాలు 

గతంలో కూడా ఇలాంటి వివాదాలు సినీ ఇండస్ట్రీని  షేక్ చేశాయి. ఉదాహరణకు, 2020లో వచ్చిన ‘పుష్ప – ది రైజ్’ సినిమా సమయంలోనూ, అంతకుముందు 2017లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథమ్’ (DJ) చిత్రంలోని కొన్ని పాటలు, డైలాగులపై కొన్ని సామాజిక వర్గాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అదే సమయంలో మేకర్స్ స్పందించి మార్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు’పెద్ది’ సినిమా సైతం అదే దారిలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది.
సాధారణంగా ఇలాంటి కాంట్రవర్సీలు కమర్షియల్ సినిమాలకు హైప్ తెచ్చిపెడతాయనే టాక్ ఉంది.కానీ గిరిజన సంస్కృతికి సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో మూవీ టీమ్ డిఫెన్స్‌లో పడ్డారని ఇన్ సైడ్ టాక్.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఇలాంటి కంటెంట్ విషయంలో సెన్సార్ బోర్డ్ మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక ఈ వివాదాన్ని సర్దుమణిగేలా చేయకపోతే బాక్సాఫీస్ కలెక్షన్లపై మరియు థియేట్రికల్ రన్‌పై దీని ప్రభావం పడే అవకాశం గట్టిగానే ఉంది.

ఆ సీన్స్ తొలగిస్తారా, లేక వివాదం మరింత ముదురుతుందా

Advertisement

దీంతో గిరిజన గిరిజన ప్రతినిధులతో సినిమా దర్శకుడు, నిర్మాతలు చర్చలు జరిపి, తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇండస్ట్రీ ఇన్సైడర్స్ టాక్.మరి ‘పెద్ది’ సినిమా విషయంలో ఏం జరగబోతోంది? మేకర్స్ ఆదివాసీ సంఘాల డిమాండ్లకు లొంగి ఆ సీన్స్ తొలగిస్తారా, లేక వివాదం మరింత ముదురుతుందా అనేది కాలమే డిసైడ్ చేయాలి.
also read :ఆగస్టు ప్రీమియర్‌కు బిగ్ బాస్ 10 రెడీ.. కింగ్ నాగ్ కొత్త లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా, ఈసారి మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ?

Tags

Related News

వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ?..అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ !

సముద్రం ఒడ్డున బాలయ్య భామ.. ఫొటో చూస్తే చూపు తిప్పుకోలేరు!

సమంత ఎంగేజ్మెంట్ రింగ్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫౌజీ వాయిదా పడినట్టేనా?

మిర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్లు ఇక లాంఛనమేనా ?

హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

Big Stories

Advertisement
×