Slumdog Teaser : ”నేనెంత ఎదవనో నాకే తెలీదు” అంటూ మాటల తూటాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన పూరి గత కొంతకాలంగా వరుస ప్లాపులతో డీలా పడ్డ సంగతి తెల్సిందే.అయితే ఈ సారి సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తానంటూ పట్టాలెక్కించిన సినిమా ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’.కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ నుండి అఫీషియల్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
టీజర్ ని పరిశీలిస్తే “ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి.. అలాంటి మా బతుకులతో ఆడితే నేనెందుకు వదులుతా” అంటూ విజయ్ సేతుపతి తనదైన మార్క్ బేస్ వాయిస్‌తో చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పూరి జగన్నాథ్ మార్క్ రగ్గడ్ క్యారెక్టరైజేషన్, విజయ్ సేతుపతి ఇంటెన్స్ యాక్టింగ్ కలగలిసి ఈ టీజర్‌లో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. మురికివాడల నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ రివెంజ్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని టీజర్ కట్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.
గతంలో పూరి జగన్నాథ్ ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి చిత్రాలతో హీరోల క్యారెక్టరైజేషన్లను పీక్స్‌లో చూపించారు. అయితే ఈసారి ఆయన విజయ్ సేతుపతి లాంటి వెర్సటైల్ యాక్టర్‌ను ఎంచుకోవడం ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలను పెంచేసింది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి భిన్నమైన ఫలితాల తర్వాత పూరి జగన్నాథ్ పక్కా స్క్రిప్ట్‌తో, పూర్తి స్థాయి యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
also read :ఫ్యాన్స్‌కు షాక్.. ‘జాతిరత్నాలు 2’ కి ఆ ఒక్కటి మైనస్ అంటున్న నాగ్ అశ్విన్!
టీజర్‌లో వినిపించే “అరేయ్ దొంగ నాకొడుకా” అనే పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ మరియు స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్సులు మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో విజయ్ సేతుపతి సరసన టాలెంటెడ్ బ్యూటీ సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో మెరవనుండటం విశేషం. కన్నడ స్టార్ నటుడు దునియా విజయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండగా, బ్రహ్మాజీ, వి.టి.వి. గణేష్, విష్ణు రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
also read :NBK 111.. థియేటర్లలో స్పీకర్లు పగిలిపోవడం ఖాయం.. బాలయ్య సినిమాపై తమన్ ఊరమాస్ అప్‌డేట్!
టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. పూరి కనెక్ట్స్ మరియు జె.బి. మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోళ్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఛార్మి కౌర్ ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో విజయ్ సేతుపతి నెగెటివ్ రోల్స్‌తో పాటు ‘మహారాజా’ వంటి చిత్రాలతో భారీ విజయాలను అందుకుని మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ సమయంలో పూరి జగన్నాథ్ లాంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడితో ఆయన జతకట్టడం నిజంగానే ఒక క్రేజీ అటెంప్ట్ అని చెప్పాలి.
‘మురికివాడల్లోని సామాన్య ప్రజల హక్కుల కోసం, వారి ఆత్మగౌరవం కోసం ఒక సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటుంది’ అనే పాయింట్‌ను పూరి తనదైన స్టైల్ డైలాగ్స్‌తో వెండితెరపై ప్రెసెంట్ చేయబోతున్నాడని టీజర్ చూస్తే క్లారిటీ వస్తుంది.ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే పోస్ట్ ప్రొడక్షన్ త్వరగా కంప్లీట్ చేసుకొని ఈ ఏడాది చివర్లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.చూడాలి మరి పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ పూరికి సాలిడ్ సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.
also read :ఆగస్టు ప్రీమియర్‌కు బిగ్ బాస్ 10 రెడీ.. కింగ్ నాగ్ కొత్త లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా, ఈసారి మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ?