E-Paper
Advertisement

Ram Charan: జపాన్ అభిమానులను కలిసిన రామ్ చరణ్, వాళ్ల కోసం ప్రత్యేకమైన గిఫ్ట్స్

Ram Charan: జపాన్ అభిమానులను కలిసిన రామ్ చరణ్, వాళ్ల కోసం ప్రత్యేకమైన గిఫ్ట్స్
Advertisement

Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. టాలీవుడ్ కి అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్ (Oscar Award) అందించింది. ఈ సినిమాలోని ప్రతి సీన్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా వచ్చిన ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్ కు విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చింది ఈ సినిమా. ఈ సినిమాతో ఈ ఇద్దరి హీరోలు గ్లోబల్ స్టార్లుగా మారాయి.

ఆర్ఆర్ఆర్ ఇంటర్నేషనల్ ఫాలోయింగ్

Advertisement

చరణ్ కి అయితే ఏకంగా గ్లోబల్ స్టార్ అనే బిరుదిని ఇచ్చేసుకున్న మెగా ఫ్యాన్స్. ఈ చిత్రం జపాన్ లోనూ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ టైంలో అక్కడ ఆడియన్స్ సందడి ఏ రేంజ్ లో ఉందో చూడాలి. ఈ హీరోల కోసం ఏకంగా ప్రత్యేకమైన గిఫ్ట్స్ కూడా ఇచ్చేశారు. అయితే ఈసారి మన గ్లోబల్ స్టార్ జపాన్ అభిమానులకు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చారు. పెద్ది మూవీ సందర్భంగా జపాన్ వెళ్లిన చరణ్.. అక్కడ ఫ్యాన్స్ తో ఇంటారాక్ట్ అయ్యాడు. ఇంతకి అసలు సంగతేంటంటే.. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికీ సినిమా నుంచి విడుదలైన పాటకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. 100 మిలియన్ పైగా వ్యూస్ కూడా వచ్చాయి. రోజుల్లో ఒక పాటకు వంద మిలియన్ న్యూస్ రావటం అనేది సాధారణమైన విషయం కాదు ఏ ఆర్ రెహమాన్ స్టామినా ఏంటో మరోసారి అర్థమయింది.

Also Read: Jani Master Wife: డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా జానీ మాస్టర్ భార్య ఘన విజయం

Advertisement

జపాన్ అభిమానులను కలిసిన రామ్ చరణ్

ఇకపోతే ఈ సినిమాను మార్చి 27న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. కొంతమంది ప్రాంతంతో సంబంధం లేకుండా ఇష్టపడటం అనేది కామన్ గా జరుగుతుంది. అలానే రామ్ చరణ్ ను కొంతమంది జపాన్ అభిమానులు విపరీతంగా ఇష్టపడుతున్నారు. వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి మరి కలిశారు. చరణ్ వాళ్ళందరితో కొసేపు మాట్లాడి ఆటోగ్రాఫ్ అందించారు. జపాన్ అభిమానులంతా రామ్ చరణ్ గత సినిమాల్లోని కొన్ని స్టిల్స్ ను గ్రీటింగ్ కార్డ్స్ గా కట్ చేస్తూ చరణ్ కు చూపించారు. చరణ్ వాళ్ళ ప్రేమకు ఆశ్చర్యపోయారు. ఇక పెద్ది సినిమాలో క్రికెట్ నేపథ్యం కూడా ఉంటుంది కాబట్టి కొన్ని బ్యాట్స్ పైన సిగ్నేచర్ చేసి రామ్ చరణ్ వాళ్ళకు అందించారు. అలానే రామ్ చరణ్ టీషర్ట్స్ తో పాటు వాళ్లు కనిపించిన విధానం సోషల్ మీడియాలో నెటిజెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైల్ అవుతుంది.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×