E-Paper
Advertisement

Jani Master Wife: డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా జానీ మాస్టర్ భార్య ఘన విజయం

Jani Master Wife: డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా జానీ మాస్టర్ భార్య ఘన విజయం
Advertisement

Jani Master Wife Ayesha: తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ (TFTDDA) ఎన్నికల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా ఘన విజయం సాధించారు. ఆదివారం (డిసెంబర్ 7) అసోషియేషన్ కి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సుమలత 29 ఓట్ల భారీ మెజారిటీతో ప్రత్యర్థి, గత ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్‌ను ఓడించారు. మొత్తం 510 ఓట్లలో 439 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో అయేషా జానీ ఎలాంటి గ్రూప్‌లు, మద్దతు లేకుండా ఒంటరిగా పోటీ చేసి గెలవడం విశేషం. మరోవైపు జోసెఫ్ ప్రకాశ్‌కు సీనియర్, ప్రముఖ డాన్స్ మాస్టర్లు అండగా నిలిచారు.

29 ఓట్ల భారీ మేజారిటీ

Advertisement

శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పోళ్లకి విజయ్, జోజో శామ్, చంద్ర కిరణ్ వంటి ప్రముఖులు జోసెఫ్‌కు బహిరంగ మద్దతు తెలిపారు. అయినా ఈ ఎన్నికల్లో అయేషా గెలవడం గమనార్హం. టీఎఫ్‌టీడీడీఏ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో మొత్తం 510 ఓట్లలో 439 ఓట్లు పోలయ్యాయి. అందులో సుమలత జానీ మాస్టర్‌కు 228 ఓట్లు, జోసెఫ్ ప్రకాష్‌కు 199, చంద్రశేఖర్‌కు 11 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 29 ఓట్ల మెజారిటీతో సుమలత విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో తను నిలబడితే మళ్లీ కుట్రలు పన్ని అడ్డంకులు కలగజేస్తారనే అనుమానంతో జానీ మాస్టర్ తన భార్యని ప్రెసిడెంట్ రేసులో ఉంచారు. ఇక్కడ జానీ మాస్టర్ తన భార్య అయేషా ప్రెసిడెంట్‌గా నిలబెట్టారు. ఈ ఎన్నికల్లో ఆమెకు సముచిత గౌరవాన్ని అందించారు.

Also Read: Akhanda 2 : అఖండ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే, ఆ సినిమాల పరిస్థితి ఏంటో

Advertisement

వేధింపుల కేసులో భర్తకు అండగా

కాగా జానీ మాస్టర్ పై ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్, ఆయన భార్య ఇద్దరు తనని శారీరకంగా, మానసికంగా వేధించారని ఆమె ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది ఆమె ఆరోపణంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చిన సైమా, నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకి కూడా వెళ్లొచ్చారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన భార్య సుమలత జానీ మాస్టర్ కు అండగా నిలిచారు. అంతా ఆయనని అనుమానిస్తున్న ఆమె మాత్రం తన భర్త అమాకుడంటూ జానీ మాస్టర్ మద్దతుగా ఉంది. పోలీసుల కేసుల్లో, కోర్టులో భర్త కోసం న్యాయ పోరాటం చేసింది. చివరకు జానీ మాస్టర్ నిర్దోషిగాఈ కేసు నుంచి బయటపడ్డారు.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×