E-Paper
Advertisement

Peddi film: భారీ ధరకు రామ్ చరణ్ పెద్ది నాన్ థియేట్రికల్ రైట్స్…చరణ కెరియర్ లోనే హైయెస్ట్!

Peddi film: భారీ ధరకు రామ్ చరణ్ పెద్ది నాన్ థియేట్రికల్ రైట్స్…చరణ కెరియర్ లోనే హైయెస్ట్!
Advertisement

Peddi film: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan)ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమా(Peddi Movie) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. నిజానికి ఈ సినిమా మార్చి 27వ తేదీ విడుదల కావాల్సి ఉండగా సినిమా షూటింగ్ పూర్తి కానీ నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ విడుదల కాబోతుందని చిత్ర బృందం అధికారికంగా తెలియజేశారు అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఏప్రిల్ 30వ తేదీ నుంచి కూడా ఈ సినిమా తప్పుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇలా మరోసారి పెద్ది వాయిదా పడబోతుంది అంటూ వార్తలు వస్తున్నప్పటికీ చిత్ర బృందం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.

నెట్ ఫ్లిక్స్ చేతికి పెద్ది డిజిటల్ రైట్స్ …

ఇదిలా ఉండగా ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుగుతూ ఉండగానే నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరలకు అమ్ముడుపోయినట్టు సమాచారం. పెద్ది సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఏకంగా 115 కోట్లకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. అదేవిధంగా ఆడియో రైట్స్ కోసం టి సిరీస్ ఏకంగా 18 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక సాటిలైట్ హక్కులకు సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

నాన్ థియేట్రికల్ బిజినెస్..

Advertisement

పెద్ది డిజిటల్ స్ట్రీమింగ్ ,ఆడియో రైట్స్ ద్వారా ఏకంగా రూ. 133 కోట్ల బిజినెస్ జరుపుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి ఈ బిజినెస్ రాంచరణ్ సినీ కెరియర్ లోనే భారీ డీల్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పట్ల మంచి అంచనాలు ఉన్న నేపథ్యంలోనే ఈ స్థాయిలో బిజినెస్ జరిగిందని చెప్పాలి. గ్రామీణ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ కూడా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామ్ చరణ్ జోడిగా అచ్చి యమ్మా పాత్రలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించబోతున్నారు.

అంచనాలు పెంచిన అప్డేట్స్..

Advertisement

ఈమెతో పాటు ఈ సినిమాలో కుషితా కల్లపు కూడా నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఈమె గురించి చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఒక గ్లింప్ వీడియో, చికిరి చికిరి సాంగ్ ఎంతో అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకొని సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ వంటి డిజాస్టర్ సినిమా తర్వాత ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: Vishnu vinyasam: భారీ ధరలకు విష్ణు విన్యాసం థియేట్రికల్ రైట్స్… సేఫ్ జోన్ లో శ్రీ విష్ణు సినిమా!

Related News

పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

మనవడి కోసం నాగబాబు సంచలన నిర్ణయం!

అప్పుడే ఏడాది..క్యూట్ పిక్ తో కొడుకుకి స్పెషల్ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్ !

ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ పిలుపు!

నిఖిల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘స్వయంబు’ రిలీజ్ అప్పడే..?

‘సర్దార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. కార్తీ అకౌంట్లో హిట్ పడిందా..?

Big Stories

Advertisement
×