RC17 : ప్రతి హీరో కెరియర్ లో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఉంటాయి. ఆ హీరో ఇన్ని సినిమాలు చేసినా కూడా ఆ ప్రత్యేకమైన సినిమాకు ఉన్న ఇమేజ్ అలా ఉండిపోతుంది. చాలామంది ప్రేక్షకులు కూడా ఆ సినిమా గురించి విపరీతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. రామ్ చరణ్ కెరియర్లో వచ్చిన బెస్ట్ ఫిలిమ్స్ లో రంగస్థలం సినిమా ఒకటి. ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చిట్టిబాబు అనే పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయిన విధానం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
మామూలుగా ఊర్లల్లో పెరిగిన వాళ్ళు గోదావరి యాసన మాట్లాడటం. అలా ప్రవర్తించడం వంటివి కామన్ గా జరుగుతుంది. కానీ చిన్నప్పుడు నుంచి గోల్డెన్ స్పూన్ అలవాటు చేసుకున్న రామ్ చరణ్ ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ పాత్రలు ఇమిడిపోవడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. దానిలో 100% సక్సెస్ సాధించి తండ్రికి తగ్గ తనయుడు అని ఆ సినిమా పర్ఫామెన్స్ తోనే అనిపించాడు. ఆ తర్వాత వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినా కూడా రంగస్థలం అనేది ఎప్పటికీ ప్రత్యేకమే.
రామ్ చరణ్ తన కెరీర్ లో ఇప్పటివరకు 15 సినిమాలు పూర్తి చేశారు. ఇప్పుడు 16వ సినిమా పెద్దిను సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నారు. బుచ్చిబాబు కూడా ఉప్పెన సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఇంటర్ ఇచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు.
ఇక పెద్ది సినిమాతో నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అందుకుంటాడు అని ఆల్రెడీ ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్స్ మొదలైపోయాయి. అంతేకాకుండా పెద్ది సినిమాకి సంబంధించి విడుదలైన వీడియో కంటెంట్ కూడా సినిమా మీద అంచనాలను విపరీతంగా పెంచేసింది. రామ్ చరణ్ కెరియర్ లో వస్తున్న 16వ సినిమా ఇది.
రామ్ చరణ్ నటించబోయే 17వ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రంగస్థలం సినిమాకి సీక్వెల్ గా ఉండబోతుంది అని కొన్ని వార్తలు కూడా వినిపించాయి. నీ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అమెరికాలో 50% షూటింగ్ ఉండబోతుందట. అలానే ఈ సినిమాను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కూడా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సుకుమార్ రామ్ చరణ్ ను విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హీరోగా చూపించాడు. అయితే తన సినిమాల్లో హీరోల్ని చాలా స్టైలిష్ గా కూడా చూపించగలిగే సత్తా సుకుమార్ కు ఉంది. అన్నిటిని మించి ఎన్టీఆర్ లాంటి మాస్ కమర్షియల్ ఇమేజ్ ఉన్న ఒక హీరోని చాలా స్టైలిష్ గా నాన్నకు ప్రేమతో సినిమాలో చూపించాడు.
ఇప్పుడు అదే తరహాలో అమెరికా బ్యాక్ డ్రాప్ లో కొంత స్టోరీ నడుస్తుంది కాబట్టి రామ్ చరణ్ ను కూడా చాలా స్టైలిష్ గా చూపించే ప్లాన్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది. అది కాకుంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ను స్టోరీ కి తగ్గట్టు జపాన్ లో చూపించినట్లు అలా ఏమైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.
Also Read: Pawan Kalyan : పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ఒప్పందం కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్