E-Paper
Advertisement

Pawan Kalyan : పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ఒప్పందం కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan : పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ఒప్పందం కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటే. కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యానర్ అతి తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ సినిమాలను నిర్మించింది. ఫాస్ట్ గా 100 సినిమాలను నిర్మించాలి అనే ద్వేయంతో ఈ ప్రొడక్షన్స్ ముందుకు సాగుతుంది. ఇప్పటికే దాదాపు 50 సినిమాలు నిర్మాణం పూర్తి చేసింది ఈ సంస్థ. ఒకవైపు మామూలు రేంజ్ సినిమాలు చేస్తూ మరోవైపు స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తుంది.

ఇదివరకే పవన్ కళ్యాణ్ ఈ బ్యానర్ లో బ్రో అనే సినిమా చేశారు. ఈ సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తిచేసి విడుదల చేశారు. రీమేక్ సినిమా కావడంతో తక్కువ సెటప్ ఉండడంతో ఈ సినిమా త్వరగా పూర్తయింది. అయితే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కి మరియు పవన్ కళ్యాణ్ కు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇకపోతే పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా ఈ బ్యానర్ లో ది రాజా సాబ్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

పవన్ కళ్యాణ్ తో ఒప్పందం 

అయితే ఈ బ్యానర్ ఇన్ని సినిమాలు నిర్మించింది కానీ విపరీతమైన పేరు తీసుకొచ్చిన సినిమా ఈ బ్యానర్ కి రాలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే కార్తికేయ , ధమాకా వంటి హిట్ సినిమాలను నిర్మించింది అని కొంతమంది గుర్తుపడతారు. ఇప్పటివరకు ఏ సినిమా తీసుకురాని ఇమేజ్ ప్రభాస్ రాజా సాబ్ తీసుకువస్తుంది అనే చాలామంది విపరీతంగా నమ్ముతున్నారు.

మరోవైపు ఈ సంస్థ పవన్ కళ్యాణ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సంస్థలో మరో రెండు సినిమాలు చేయనున్నారట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పేరుతో ఈ సంస్థతో పాటు కలిసి సినిమాలు నిర్మిస్తారు అనే వార్తలు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా టైంలోనే తర్వాత నేను సినిమాలు చేస్తాను లేదో తెలియదు గాని నా ప్రొడక్షన్ హౌస్ లో మాత్రం సినిమాలు నిర్మిస్తాను అంటూ అప్పట్లో చెప్పారు. ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి సినిమాలను నిర్మించే ఆలోచనలో ఉన్నారట.

పర్ఫెక్ట్ మూవీ 

టీజీ విశ్వప్రసాద్ మరియు పవన్ కళ్యాణ్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఇది కొంచెం వర్క్ ఔట్ అయ్యే ప్లాన్ అని చెప్పాలి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ బ్యాక్ గ్రౌండ్ పీజీ విశ్వప్రసాద్ కి ఉంది కాబట్టి ఒక కంటెంట్ టీం ను హైయర్ చేసుకొని కథలను ఎంపిక చేస్తూ ముందుకు వెళ్లొచ్చు.

అయితే ఇప్పటికీ కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో తెరకెక్కే సినిమాలు కొన్నింటిని కంటెంట్ విని, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతుందట. ఇకపోతే పవన్ కళ్యాణ్ కూడా యాడ్ అయ్యారు కాబట్టి ఇకపైన జాగ్రత్తగా ప్రాజెక్టులు ప్లాన్ చేస్తారు అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరి కలయిక గురించి అధికారికంగా ప్రకటన రాలేదు.

Also Read: Mana Shankara Vara Prasad Garu : ఎప్పుడో సినిమా చేయాల్సింది కానీ చిరంజీవి నుంచి తప్పించుకున్నాను

Related News

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

Big Stories

×