E-Paper
Advertisement

Ram Gopal Varma : ఆ టెక్నిక్ లేకపోతే రజనీకాంత్ అసలు స్టార్ ఏ కాదు, దాన్ని ఎవరు కేర్ చేయరు

Ram Gopal Varma : ఆ టెక్నిక్ లేకపోతే రజనీకాంత్ అసలు స్టార్ ఏ కాదు, దాన్ని ఎవరు కేర్ చేయరు
Advertisement

Ram Gopal Varma : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్నిసార్లు మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని లాజిక్స్ కూడా ఉంటాయి. అందుకనే రామ్ గోపాల్ వర్మ మాటలుకు ఎక్కువగా కౌంటర్ ఎటాక్స్ ఎవరు ఇవ్వలేరు. ఇచ్చిన కూడా వాటిని పెద్ద సీరియస్ గా తీసుకోడు రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే అతను మాట్లాడే ప్రతి మాటకి తన దగ్గర ఒక లాజిక్ ఉంటుంది. ఈ లాజిక్ ను చాలామంది ఇష్టపడుతుంటారు.

గతంలో రజినీకాంత్ గురించి కూడా రాంగోపాల్ వర్మ సంచలమైన వ్యాఖ్యలు చేశారు. స్లో మోషన్ లేకపోతే రజనీకాంత్ అసలు స్టార్ హీరో కాదు అంటూ అప్పట్లో మాట్లాడారు. ఈ మాటలు అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం రజనీకాంత్ మీద మరోసారి అదే వ్యాఖ్యలు చేశాడు రాంగోపాల్ వర్మ. రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఆ టెక్నిక్ లేకపోతే అంతే 

Advertisement

రజినీకాంత్ లో అందరూ బాగా ఇష్టపడేది అతని స్టైల్, అలానే స్వాగ్. ఇవన్నీ కూడా అతనిలో చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. దానిని మ్యాచ్ చేయడానికి ఎవరు ప్రయత్నించినా కూడా అంత ఈజీగా దాన్ని అందుకోలేరు. అయితే కొన్నిసార్లు రజనీకాంత్ స్లో మోషన్ లో నడిచి వస్తుంటే అది కూడా ప్రేక్షకుడికి ఒక హై ఇస్తుంది.

తాజాగా రజినీకాంత్ పైన అవే కామెంట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. “స్లో మోషన్ ఎప్పుడూ కనిపెట్టబడకపోతే, రజనీకాంత్ అతిపెద్ద స్టార్ అయ్యేవాడని నేను అనుకోను. ఆయన కంటే ఎవరూ స్లో మోషన్‌ను బాగా వాడుకోలేదు అని చెప్పారు.

పర్ఫామెన్స్ కూడా ఉన్నాయి 

Advertisement

రజనీకాంత్ అంటే కేవలం స్టైల్, స్లో మోషన్ అని మాత్రమే కాకుండా అతని పర్ఫామెన్స్ కూడా కొన్ని అద్భుతంగా వర్కౌట్ అయినవి ఉన్నాయి. దళపతి సినిమాలో రజనీకాంత్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కేవలం కళ్ళతోనే తాను యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలి సినిమాలో కూడా ఎక్కువగా సూపర్స్టార్ పెర్ఫార్మెన్స్ కే ప్రాధాన్యత ఉండేలా డిజైన్ చేశాడు లోకేష్. అయితే రజినీకాంత్ నుంచి కోరుకునే అంశాలు ఆ సినిమాలో లేకపోవడం వల్లనే చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. కానీ లోకేష్ మాత్రం కంప్లీట్ యాక్టర్ ని బయటకు తీయాలి అనే ప్రయత్నంలోనే ఆ స్టోరీ డిజైన్ చేశాడు.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవ్వడం మొదలయ్యాయి. అయితే దీనిపైన మళ్లీ రజనీకాంత్ అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Also Read : Andhra King Taluka : హీరో రామ్ పై నిర్మాతలు ఒత్తిడి, రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వాల్సిందే?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×