E-Paper
Advertisement

Andhra King Taluka : హీరో రామ్ పై నిర్మాతలు ఒత్తిడి, రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వాల్సిందే?

Andhra King Taluka : హీరో రామ్ పై నిర్మాతలు ఒత్తిడి, రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వాల్సిందే?
Advertisement

Andhra King Taluka : రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇతరుణంలో చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ విపరీతంగా చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది కాబట్టి ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గా వైజాగ్ లో కూడా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. దానిలో రామ్ పోతినేని మాట్లాడుతూ సినిమా మీద విపరీతమైన అంచనాలు పెంచాడు. పడ్డాం అని తెలుసు ఈసారి గట్టిగా కొడుతున్నాం అంటూ సినిమా మీద కాన్ఫిడెన్స్ పెంచాడు. అయితే రామ్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది అని ఆలోచనలోనే ఉన్నారు.

రామ్ పై నిర్మాతల ఒత్తిడి

Advertisement

ఈ సినిమాకి సంబంధించి రామ్ పోతినేని రెమ్యూనరేషన్ గురించి పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొదట్లో ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి రామ్ 30 కోట్ల వరకు డిమాండ్ చేశాడు. తరువాత రెమ్యూనరేషన్ కాదు నైజం రైట్స్ కావాలని అడిగాడు. అవేమి అవ్వలేదు. పైగా ఈ తాలూకా మూవీకి బజ్ చాలా తక్కువ ఉంది. ఎంత ప్రమోషన్ చేసినా.. ఎన్ని ఈవెంట్స్ పెట్టినా.. సినిమాపై బజ్ క్రియేట్ అవ్వడం లేదు.

దీంతో నిర్మాతలు హీరో రెమ్యూనరేషన్ ని 18 నుంచి 20 కోట్ల వరకు తగ్గించాలని ఆలోచనలు ఉన్నారంట. మూవీకి మంచి కలెక్షన్స్ రాకపోతే. హీరో గారి రెమ్యూనరేషన్ తగ్గేలా ఉంది. నిర్మాతలే తగ్గించేలా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మరోవైపు రామ్ మాత్రం ఈ సినిమా మీద విపరీతమైన కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

ఇస్మార్ట్ తర్వాత హిట్ లేదు 

Advertisement

ఇకపోతే రామ్ పోతినేని హిట్ సినిమా చేసి చాలా ఏళ్లు అయిపోయింది. ఎన్నో అంచనాల మధ్య వస్తున్న సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోతున్నాయి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన రెడ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన స్కంద, వారియర్ ఇలా వరుస సినిమాలన్నీ కూడా చేదు అనుభవాలనే మిగిల్చాయి.

ఎన్నో నమ్మకాలతో చేసిన డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమాతో రామ్ కం బ్యాక్ ఇస్తే అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.

Also Read: Prabhas : ప్రభాస్ దర్శకులు అందరూ ప్రామిస్ లు చేస్తున్నారు, ఒకరిని మించి ఒకరు

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×