E-Paper
Advertisement

Ravi Shastri: సొంత గ్రౌండ్ లో టీమిండియాను గెలిపించ‌డం చేత కాక‌పోతే, రంజీ జ‌ట్ల‌కు కోచింగ్ ఇవ్వుపో

Ravi Shastri: సొంత గ్రౌండ్ లో టీమిండియాను గెలిపించ‌డం చేత కాక‌పోతే, రంజీ జ‌ట్ల‌కు కోచింగ్ ఇవ్వుపో
Advertisement

Ravi Shastri : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ( Gautam Gambhir) రోజు రోజుకు తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. అతడు హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న చెత్త నిర్ణయాల వల్ల టీమిండియా ఓడిపోతోంది అంటూ టీం ఇండియా అభిమానులు కూడా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పరువు తీశాడు టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి ( Ravi Shastri). నీకు టీమిండియాను గెలిపించడం చేతకాకపోతే, రాజీనామా చేసి వెళ్ళిపో అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు రవి శాస్త్రి.

Also Read: Smriti Mandhana Wedding: పలాష్ కు మరో అమ్మాయితో ఎఫైర్.. పెళ్ళి ఆపేందుకే స్మృతి తండ్రి గుండెపోటు డ్రామాలు?

గౌతమ్ గంభీర్ పరువు తీసిన రవి శాస్త్రి ( Ravi Shastri)

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa ) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ టీమ్ ఇండియా ఓడిపోయింది. అనవసరంగా సాయి సుదర్శన్ లాంటి కీలక ప్లేయర్ ను డ్రాప్ చేసి, ఇండియా ఓడిపోయేలా చేశాడు గౌతమ్ గంభీర్. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ ను చివరలో బ్యాటింగ్ కు దించి మరో పెద్ద తప్పిదం చేశాడు గౌతమ్ గంభీర్. బ్యాటింగ్ ఆర్డర్ కూడా పూర్తిగా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి చాలా సీరియస్ అయ్యారు. ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల టీమిండియా ఓడిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంత గడ్డపై టీమిండియాను గెలిపించ లేకపోతే, కోచ్ గా ఉండడం దండగ అంటూ గౌతమ్ గంభీర్ ఇజ్జత్ తీశాడు. ఇండియాలో మన జట్టును గెలిపించ లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపో.. రంజీ లేదా దేశవాళీ జట్లకు కోచ్ గా వ్యవహరించు.. అక్కడ సక్సెస్ అయిన తర్వాత మళ్లీ టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించు అంటూ గౌతమ్ గంభీర్ కు కౌంటర్ ఇచ్చారు రవి శాస్త్రి. దీంతో గంభీర్ పై రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

గౌతమ్ గంభీర్ రాజీనామా చేసే ఛాన్స్ ?

Advertisement

చాలా రోజుల నుంచి గౌతమ్ గంభీర్ పై టీమిండియా అభిమానులతో పాటు మహమ్మద్ షమీ లాంటి క్రికెటర్లు అందరూ పెద్దవి విరుస్తున్నారు. గౌతమ్ గంభీర్ చెత్త నిర్ణయాల వల్ల టీమిండియా ఓడిపోతుందని, మంచి స్టఫ్ ఉన్న వాళ్లకు జట్టులో అవకాశం రావ‌డంలేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసేందుకు గౌతమ్ గంభీర్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా నిన్నటి నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ గౌతమ్ గంభీర్ తన పదవికి రాజీనామా చేస్తే వివిఎస్ లక్ష్మణ్ కు అవకాశం రానుంది.

Also Read: Smriti Mandhana Wedding: స్మృతి మంధానకు మరో షాక్… ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త ముచ్చల్!

 

Related News

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

Big Stories

Advertisement
×