E-Paper
Advertisement

Ram Gopal Varma: చిరంజీవితో సినిమా చేసే కెపాసిటీ లేదు.. నాకు చేతకాదు

Ram Gopal Varma: చిరంజీవితో సినిమా చేసే కెపాసిటీ లేదు.. నాకు చేతకాదు
Advertisement

Ram Gopal Varma:వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శివ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ చరిత్రని తిరగరాసిన డైరెక్టర్ గా వర్మ పేరు ఎప్పుడు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శివ తర్వాత రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్.. బాలీవుడ్ అంటూ స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేశాడు. అయితే ఇప్పటివరకు వర్మ డైరెక్ట్ చేయని ఏకైక హీరో చిరంజీవి.

శివ తర్వాత చిరుతో వర్మ వినాలని ఉంది అనే సినిమాను తెరకెక్కించాల్సి ఉంది. అశ్వినిదత్ నిర్మించిన ఈ సినిమా సగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత అదే సమయంలో బాలీవుడ్ నుంచి వర్మకు ఛాన్స్ రావడంతో చిరు సినిమా షూటింగ్ మధ్యలో వదిలేసి బాలీవుడ్ వెళ్ళిపోయాడని, దీంతో వినాలని ఉంది మధ్యలోనే ఆగిపోయిందని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత వర్మకు చిరంజీవికి మధ్య మాటల్లేవని టాక్.

Advertisement

అంత జరిగినా కూడా చిరంజీవి వర్మను క్షమించి శివ సినిమా నాగార్జున కోసం వర్మ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇక వర్మ సైతం చిరంజీవిని క్షమాపణ కోరుతూ ఒక వీడియో పెట్టుకొచ్చాడు.  అయితే ఈ క్షమాపణ వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ చిరంజీవితో సినిమా ఎందుకు చేయలేదు అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

చిరంజీవి గనుక ఇప్పుడు మిమ్మల్ని పిలిచి సినిమా అవకాశం ఇస్తాను అంటే మీరు చేస్తారా అన్న ప్రశ్నకు వర్మ మాట్లాడుతూ..” చిరంజీవి గారితో సినిమా చేసే కెపాసిటీ నాకు లేదు. నా సెన్సిబిలిటీలో నేను అనుకున్న సినిమాకు ఆయనకున్న ఇమేజ్ కి, ఆయన మీద ఆయన ఫ్యాన్స్ కున్న అంచనాలకు నా సినిమా  సెట్ అవ్వదు. చిరంజీవితో సినిమా నేను చెయ్యను అనట్లేదు కానీ అంత కెపాసిటీ నాకు లేదు అంటున్నాను. నాకు చేతకాదు. అవును నిజం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. నిజానికి వర్మ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. శివ సమయంలో అయితే అన్ని అంచనాలు ఉండేవి కాదు. ఎందుకంటే అప్పటికీ వర్మ తీసిన సినిమాలు వేరు.. ఇప్పుడు వర్మకున్న పేరు వేరు.. చిరుకు ఉన్న ఫ్యాన్స్ వేరు. అది దృష్టిలో పెట్టుకొని వర్మ మాట్లాడడం  గ్రేట్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×