E-Paper
Advertisement

Karthi New Movie : అన్నగారు వస్తారు… కార్తీ కొత్త సినిమా టైటిల్ రివీల్

Karthi New Movie : అన్నగారు వస్తారు… కార్తీ కొత్త సినిమా టైటిల్ రివీల్
Advertisement

Karthi New Movie : కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi)సినిమాలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో కార్తీ ప్రతి ఒక్క సినిమాని కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక త్వరలోనే కార్తీ మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు . నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కార్తీ ,కృతి శెట్టి (Kriti Shetty)హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తమిళంలో “వా వాతియార్” (Vaa Vaathiyaar)అనే పేరిట విడుదల కాబోతోంది.

అన్నగారు వస్తారు ..

ఇక ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయబోతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఈ సినిమా తెలుగు టైటిల్ ప్రకటన చేశారు ఈ సినిమాకు “అన్నగారు వస్తారు”(Annagaaru Vastaru) అనే టైటిల్ కన్ఫామ్ చేస్తూ తాజాగా పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇదివరకు చిత్ర బృందం ప్రకటించారు. కానీ అదే రోజు బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి..

డిసెంబర్లోనే అన్నగారు వస్తారు..

Advertisement

ఈ సినిమా వాయిదా గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ చిత్ర బృందం మాత్రం ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు. తాజాగా ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ అవుతుందని మాత్రం తెలిపారు కానీ సరైన తేదీ ప్రకటించలేదు. ఇక గత కొద్ది రోజులుగా కార్తీ నటించిన సినిమాలు ఇటీవల పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ఇంకా డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడు పోలేదని, అలాగే సినిమా బిజినెస్ క్లియర్ కాకపోవడంతో రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇటీవల కార్తి సత్యం సుందరం అనే సినిమా ద్వారా తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

కృతి శెట్టికి సక్సెస్ వచ్చేనా?

Advertisement

ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఇటు కార్తీ అభిమానులు కృతి శెట్టి అభిమానులు కూడా ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఈమె ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన ఏ ఒక్కటి కూడా సరైన సక్సెస్ అందుకోని నేపథ్యంలో పూర్తిగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మరి కోలీవుడ్ ఇండస్ట్రీలో నైనా సక్సెస్ అందుకునేనా? లేదా ?అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన సాంగ్, పోస్టర్స్ అయితే మాత్రం సినిమాపై మంచి అంచనాలని పెంచేసాయి. మరి ఈ సినిమా ఇటు తెలుగులో అటు తమిళంలో ఎలాంటి ఆదరణ పొందుతుంది? తిరిగి కృతి శెట్టికి టాలీవుడ్ కం బ్యాక్ ఇచ్చే సినిమాగా నిలుస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Varanasi Movie: వారణాసి కోసం మహేష్ బాబు రెమ్యూనరేషన్ ..పెద్ద ప్లానింగే!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×