E-Paper
Advertisement

Upcoming Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఫోకస్ అంతా ఆ సినిమాపైనే..

Upcoming Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఫోకస్ అంతా ఆ సినిమాపైనే..
Advertisement

Upcoming Movies: ప్రతినెలా థియేటర్లలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ నవంబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని మిక్స్డ్ టాక్ ని అందుకోవడంతో ఎక్కువగా ఆకట్టుకోలేక పోయాయి. అయితే గత వారంలో వచ్చిన సినిమాలు సక్సెస్ కాలేదు. ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం తప్ప మిగిలిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోలేదని తెలిసిందే. ఇక ఈ వారం రాబోతున్న సినిమాలపై జనాలు కాస్త ఆసక్తి కనబరుస్తున్నారు. ఈవారం థియేటర్లలోకి ఏయే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. 

నవంబర్ మూడో వారంలో పెద్ద బడ్జెట్ చిత్రాలు అయితే లేవు. కానీ ఉన్నంతలో అన్ని సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. మాస్, ఫ్యామిలీ ఎమోషన్స్, సస్పెన్స్ థ్రిల్లర్‌లు, హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలు కూడా ఈ రేసులో ఉన్నాయి.. ఈ వీక్ థియేటర్లలోకి ఏయే సినిమాలు రాబోతున్నాయో చూసేయ్యండి.

ప్రేమంటే.. 

Advertisement

టాలీవుడ్ హీరో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ప్రేమంటే.. ఈ సినిమాకు నవనీత్‌ శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, జాన్వి నారంగ్‌ నిర్మిస్తున్నారు. సుమ కనకాల కీలక పాత్రలో న‌టిస్తుంది. ఈ చిత్రం న‌వంబ‌ర్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది..

మఫ్టీ పోలీస్..

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ, ఐశ్వర్య రాజేష్ ల పోలీస్ ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామా ‘తీయవర్ కులై నడుంగ’ తెలుగులో ‘మఫ్టీ పోలీస్’ గా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో జియస్సార్ అర్ట్స్ బ్యానర్ పై జి. అరుల్ కుమార్ నిర్మించారు.

పాంచ్ మినార్.. 

Advertisement

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గతఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాల్లో ఏ సినిమా కూడా అతనికి మంచి క్రేజ్ మాత్రం అందించలేకపోయాయి.. ఈ ఏడాది చిరంజీవ సినిమాలో నటించాడు. అది డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అక్కడ మంచి వ్యూస్ ను రాబట్టింది.. పాంచ్ మీనార్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. ఈ మూవీ ఈనెల 21న థియేటర్లలోకి రాబోతుంది.

12ఎ రైల్వే కాలనీ..

టాలీవుడ్ స్టార్ అల్లరి నరేశ్‌ హీరోగా రానున్న చిత్రం ‘12ఎ రైల్వే కాలనీ’. ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ చిత్రాలకు రైటర్‌గా పని చేసిన నాని కాసరగడ్డ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజైన ట్రైలరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ కూడా 21న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది..

ఈ సినిమాలు మాత్రమే కాదు వీటితోపాటుగా.. కలివి వనం, హ్యాపీ జర్నీ, ఇట్లు మీ ఎదవ, రాజు వెడ్స్ రాంబాయి, ప్రేమలో రెండోసారి ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. అంతే కాదు.. తమిళ హీరో కార్తీ, అమ్మన్నా జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఆవారా సినిమా రీ రిలీజ్ కాబోతుంది.. దీంతోపాటుగా కొదమ సింహం కూడా రీ రిలీజ్ అవుతుంది.. ఈ వారం సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉందని తెలుస్తుంది. అయితే రిలీజ్ అవుతున్న సినిమాలలో చాలావరకు చిన్న సినిమాలే కావడంతో జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.. వీటిలో కేవలం ప్రేమంటే సినిమా కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మరి ఈ మూవీ థియేటర్ల లోకి వచ్చిన తర్వాత ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Big Stories

Advertisement
×