E-Paper
Advertisement

Shiva Movie: శివ సినిమాలో సైకిల్ చేజ్ టైంలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్… ఇప్పుడు ఎక్కడ, ఏం చేస్తున్నారో తెలుసా?

Shiva Movie: శివ సినిమాలో సైకిల్ చేజ్ టైంలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్… ఇప్పుడు ఎక్కడ,  ఏం చేస్తున్నారో తెలుసా?
Advertisement

Shiva Movie : సాధారణంగా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి కథను మలుపు తిప్పే పాత్రలలో ఈ చిన్నారులు ఆకట్టుకుంటూ ఉంటారు. ఇంకొన్ని సినిమాలు ఏకంగా పిల్లలను బేస్ చేసుకుని వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వీరంతా పెద్దయ్యాక స్టడీస్ పైన ఫోకస్ పెట్టి.. అందులో కొంతమంది తమకు నచ్చిన రంగంలో సెటిల్ అయితే.. మరికొంతమంది మళ్లీ సినిమాలలోకి వచ్చి హీరోలుగా, హీరోయిన్ లుగా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు నాగార్జున (Nagarjuna ) హీరోగా, అమల (Amala) హీరోయిన్గా రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో కేవలం రూ.75 లక్షల బడ్జెట్ తో తెరకెక్కి.. ఏకంగా 10 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించిన శివ మూవీ రీ రిలీజ్ అవుతోంది.

సైకిల్ చేజ్ లో కనిపించిన చిన్నారి ఇప్పుడేం చేస్తోందంటే?

ఈ సందర్భంగా ఈ సినిమాలో ఒక సన్నివేశంలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడు ఎక్కడ ఉంది ? ఏం చేస్తోంది ? అనే విషయాన్ని.. ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.. ముందుగా ఆ సీన్ విషయానికి వస్తే.. నాగార్జున శివ సినిమాలో విలన్స్ పరిగెడుతుంటే.. ఒక చిన్న పిల్లని తన సీట్ ముందు కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుతూ ఉంటాడు. అది అప్పుట్లో చాలా రిస్క్. డూప్ కూడా చేసే అవకాశం లేదు. ఒక చేత్తో సైకిల్ తొక్కి.. ఒక చేత్తో ఈ పాపను పట్టుకుంటాడు.. అప్పట్లో ఈ పాప అందరి దృష్టిని ఆకట్టుకుంది. అలా సైకిల్ చేజ్ సన్నివేశంలో నటించి.. అందరినీ ఆకట్టుకున్న ఈ చిన్నారి ఇప్పుడు రాంగోపాల్ వర్మ పుణ్యమా అని మరొకసారి వైరల్ గా మారుతోంది.

Advertisement

ALSO READ:Bigg Boss 9 Promo: కమాండర్ పవర్.. రిస్కీ టాస్క్ లో ఉత్కంఠ!

ట్వీట్ తో చైల్డ్ ఆర్టిస్ట్ పై అంచనాలు పెంచిన వర్మ..

రీ రిలీజ్ సందర్భంగా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి వర్మ ప్రస్తావిస్తూ ఆమె ఇప్పుడు ఏం చేస్తోంది? ఎక్కడ ఉంది అనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. “శివ సినిమాలోని ఐకానిక్ సైకిల్ చేజ్ సన్నివేశంలో ఎదిగిన అమ్మాయి సుష్మ. ఆమె బార్ లో భయంగా కూర్చుని నాగార్జునతో కలిసి టెన్షన్లో సైక్లింగ్ చేస్తూ కనిపించింది. అయితే ప్రస్తుతం ఆమె ఇప్పుడు యూఎస్ఏ లో ఏఐ – కాగ్నిటివ్ సైన్స్ లో పరిశోధన చేస్తోంది”అంటూ వర్మ తెలిపారు. ఇకపోతే ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిన్నారి.. ఇప్పుడు ఏకంగా కొత్త టెక్నాలజీలో పరిశోధనలు చేస్తోంది అని తెలియడంతో అభిమానులు ఆమె టాలెంట్ కి ఫిదా అవుతున్నారు.

సుష్మాకి క్షమాపణలు చెప్పిన వర్మ..

Advertisement

వర్మ మరో ట్వీట్ షేర్ చేస్తూ సుష్మాకి క్షమాపణలు తెలియజేశారు.. “సుష్మ నువ్వు ఆ సన్నివేశంలో ఎంతో సాహసోపేతంగా నటించావు. అయితే అప్పుడు నువ్వు ఎంత భయం ఎదుర్కొన్నావో ఒక దర్శకుడిగా ఆ సమయంలో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను..” అంటూ వర్మ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×