E-Paper
Advertisement

Cabinet Meet: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..

Cabinet Meet: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..
Advertisement

Cabinet Meet: నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యంత కీలక సమావేశం జరగనుంది. ఢిల్లీ బ్లాస్ట్‌పై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. నిన్న భూటాన్ పర్యటనలో మాట్లాడిన మోడీ.. ఈ ఘటన వెనుక ఉన్న ఉగ్రవాద శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.

నిందితులు ఎక్కడ దాక్కున్నా వదిలేది లేదని మోదీ హెచ్చరిక..
దేశ భద్రతను కించపరచే కుట్రదారులను చట్టం ముందు నిలబెడతామన్నారు. నిందితులు ఎక్కడ దాక్కున్నా వారిని వెంబడించి పట్టుకుంటామని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ముమ్మరంగా పనిచేస్తున్నాయని.. ఈ ఉగ్రకుట్ర వెనుక ఉన్న ప్రతి సంబంధాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. దేశ భద్రత, ప్రజల ప్రాణరక్షణ విషయంలో రాజీకి తావు ఉండదని పేర్కొన్నారు.

Advertisement

నేడు ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..
దేశ ఆర్థిక, సామాజిక ఎజెండాను దృష్టిలో ఉంచుకుని ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల రంగంలో మూలధన పెట్టుబడిని పెంచడం, కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంపై కేంద్రం దృష్టి సారించనుంది. దీంతోపాటు, వివిధ కేంద్ర పథకాల విస్తరణ ప్రణాళికలపైనా చర్చ జరగనుంది. సామాన్య ప్రజలను ప్రభావితం చేసే ధరల స్థిరీకరణ చర్యలు ఎజెండాలో ఉన్నాయి. నిత్యావసరాల ధరలను నియంత్రించడానికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై మంత్రివర్గం సమీక్షించనుంది.

Also Read: కాలుష్యం ఎఫెక్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఢిల్లీ విద్యార్థులకు పండగే పండుగ

Advertisement

శీతాకాల సమావేశాల కోసం, కొత్త బిల్లులు, ముఖ్యమైన ఆర్డినెన్స్‌ల ముసాయిదాలపై చర్చ..
రైతు సంక్షేమం, పంటల కొనుగోలు విధానాలు, రబీ సీజన్‌కు సంబంధించిన అంశాలపైనా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల కోసం, కొత్త బిల్లులు, ముఖ్యమైన ఆర్డినెన్స్‌ల ముసాయిదాలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×