E-Paper
Advertisement

Bigg Boss 9 Promo: కమాండర్ పవర్.. రిస్కీ టాస్క్ లో ఉత్కంఠ!

Bigg Boss 9 Promo: కమాండర్ పవర్.. రిస్కీ టాస్క్ లో ఉత్కంఠ!
Advertisement

Bigg Boss 9 Promo: బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన 66వ ఎపిసోడ్ కు సంబంధించిన తాజా ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా బిగ్ బాస్ మేకర్స్ లేటెస్ట్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ పూర్తిగా ఫన్ మోడ్ లో కనిపించారు. అయితే ఈ వారం బిగ్ బాస్ అందర్నీ నామినేట్ చేశారు. ఇక కెప్టెన్ ఇమ్మానుయేల్ ని కూడా నామినేట్ చేయగా.. ఇంట్లో వారికి ఛాన్స్ ఇచ్చి మీలో ఎంతమంది ఇమ్మానుయేల్ ని కూడా నామినేట్ చేయాలి అనుకుంటున్నారో ఎస్/ నో అని ఓటు వేయండి అని చెప్పగా.. హౌస్ లో ఉన్న ఒకరు తప్ప అందరూ కూడా ఇమ్మానుయేల్ నామినేట్ కాకూడదని ఓటు వేశారు.దాంతో ఇమ్మానుయేల్ నామినేషన్స్ నుండి తప్పుకున్నారు. అయితే నామినేషన్స్ లో ఉన్న వారికి అందులో నుండి సేవ్ అయ్యే ఆప్షన్ కూడా ఇచ్చారు.

కంటెస్టెంట్స్ తో చిరంజీవి స్టెప్పులు..

అలా రీతు, కళ్యాణ్, దివ్యలను రాజు, రాణులుగా నియమించి హౌస్ లో ఉన్న 8 మందిని నలుగురు కమాండర్స్, నలుగురు ప్రజలుగా విభజించమన్నారు. అలా ఇందులో ఇమ్మాన్యుయల్, భరణి,గౌరవ్, సుమన్ శెట్టి లను ప్రజలుగా విభజించగా.. కమాండర్స్ గా తనూజ, డిమోన్, నిఖిల్,సంజనా లను విభజించారు.అయితే తాజా ప్రోమోలో సుమన్ శెట్టిని లోపలికి పిలిచి మీలో ఒక చిరునవ్వు చూపించండని దివ్య ఆర్డర్ వేస్తుంది.చిరంజీవి వీణ స్టెప్ వేస్తూ నవ్వండని చెప్పడంతో సుమన్ శెట్టి కూర మాడిపోతుందని చెప్పినా కూడా వినకుండా పరవాలేదు చేసి వెళ్ళండి అని ఆయనతో వీణ స్టెప్ వేయిస్తారు..

Advertisement

సుమన్ శెట్టి స్టెప్పుకి అక్కడ ఉన్న వాళ్ళందరూ తెగ నవ్వేశారు. అంతేకాదు చిరునవ్వు అన్న ప్రతిసారి ఆ స్టెప్ వేయాలని చెబుతారు. ఆ తర్వాత భరణిని పిలిచి చిరునవ్వు అంటే ఏంటి అని అడగగా..ఆయన స్మైల్ ఇచ్చి చూపెడతారు. కానీ ఇది చిరునవ్వు కాదు మాకు చిరునవ్వు తెప్పించడానికి స్టెప్ వేస్తూ నవ్వాలని చెప్పడంతో భరణి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 లోని స్టెప్ వేసుకుంటూ నవ్విస్తారు.

ఇది చూసిన దివ్య చిరునవ్వు అన్న ప్రతిసారి ఈ స్టెప్ వేయాలని చెబుతుంది. ఆ తర్వాత భరణి బయటికి వెళ్లడంతోనే ఇమ్ము ఏం చేశార్రా మా అన్నని అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత భరణి స్టెప్ వేస్తూ చూపించడం చాలా ఫన్నీగా అనిపిస్తుంది.ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఇమ్మానుయేల్ ని లేపుకొని తీసుకురండి అనడంతోనే డిమోన్ ఇమ్మూని ఎత్తుకొని తీసుకువస్తాడు.ఆ తర్వాత ఇమ్మానుయేల్ ని ముఠామేస్త్రి స్టెప్ వేయమంటారు.దానికి ఇమ్ము ముఠామేస్త్రి స్టెప్ వేసి ఫన్ క్రియేట్ చేస్తారు.

Advertisement

ALSO READ:Betting Apps Case : నేడు CID విచారణకు ప్రకాష్ రాజ్.. స్టేట్మెంట్ పై ఉత్కంఠ

రిస్కీ టాస్క్..

ఆ తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారు. కమాండర్స్ తమ స్థానాన్ని కాపాడుకోవడానికి,ప్రజలు కమాండర్స్ స్థానాన్ని సంపాదించడానికి నిలబెట్టు.. పడగొట్టు.. గెలుపొందు.. అనే టాస్క్ ఇచ్చారు. ఇక ఈ టాస్క్ లో మొదట కమాండర్స్ వెళ్లి తమ స్థానాన్ని కాపాడుకోవడం కోసం గేమ్ ఆడతారు. మరి కమాండర్లు తమ స్థానాన్ని కాపాడుకోగలుగుతారా.. ? ప్రజలు కమాండర్ల స్థానాన్ని సంపాదించుకోగలుగుతారా? అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×