E-Paper
Advertisement

Andhra King Taluka Story : ‘సైన్మా’ పోలికలతో రామ్ సినిమా.. ఆంధ్ర కింగ్ తాలూకా కథ ఇదేనా ?

Andhra King Taluka Story : ‘సైన్మా’ పోలికలతో రామ్ సినిమా.. ఆంధ్ర కింగ్ తాలూకా కథ ఇదేనా ?
Advertisement

Andhra King Taluka Movie Story : రామ్ పోతినేని – భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా మూవీపై ఇప్పటి వరకు అయితే మంచి అంచనాలే ఉన్నాయి. ఉన్నాయి దీనికి ఆ జంటే. వారి మధ్య వచ్చిన లవ్ గాసిప్స్.. రామ్ పాడిన పాట.. రాసిన లిరిక్స్ కొంతమేర మెప్పించాయి. దీంతో సినిమాపై కొంత హైప్ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి స్టోరీ ఇదే అంటూ సమాచారం అందుతుంది. ఆ స్టోరీ ఓ షార్ట్ ఫిలింను పోలి ఉందని అనిపిస్తుంది. ఆ స్టోరీ ఏంటి…? ఆ షార్ట్ ఫిలిం ఏంటి అనేది ఇప్పుడు ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

11 సంవత్సరాల క్రితం దర్శకుడు తరుణ్ భాస్కర్ ఓ షార్ట్ ఫిలిం చేశాడు. అదే “సైన్మా”. ఈ షార్ట్ ఫిలిం గురించి అంత గొప్పగా చేశారు దాన్ని. దాంట్లో రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్ లో కనిపించారు. ముందు ఈ ‘సైన్మా’ షార్ట్ ఫిలిం స్టోరీ ఏంటో చూద్దాం.

Advertisement

రాము అనే పాత్రలో రాహుల్ రామకృష్ణ పాత్రలో కనిపిస్తాడు. ఈ రాము… రాముల అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ, ఆ ప్రేమకు రాముల వాళ్ల అన్నయ్య ఒప్పుకోడు. దీంతో రాము ఛాలెంజ్ చేస్తాడు. తనకున్న మూవీ థియేటర్‌ను హౌస్ ఫుల్ చేస్తా అని.. అప్పుడే రాములతో పెళ్లి అని.. ఒక వేళ థియేటర్ ఫుల్ అవ్వకపోతే.. రాములను మర్చిపోతానని, ఆ ఊరు విడిచి వెళ్లిపోతా అని ఛాలెంజ్ చేస్తాడు. చాలా రోజులు ట్రై చేసినా.. థియేటర్ హౌస్ ఫుల్ కాదు. కానీ, తర్వాత రీ ఎడిట్ చేస్తే సినిమా బాగా వస్తుంది. థియేటర్ ఫుల్ అవుతుంది. రాములతో రాము పెళ్లి అవుతుంది. కథ సుకాంతం.

అచ్చం ఇదే స్టోరీతో రామ్ పోతినేని – భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఉంటుందట. హీరో సినిమాలో సాగర్ పాత్రలో కనిపించబోతున్నాడు. సాగర్ ఓ హీరోకి వీరాభిమాని. ఆ హీరో.. ఆ హీరో సినిమాలంటూ బతికేస్తాడట. అలాగే.. హీరోయిన్‌ను ప్రాణంగా ప్రేమిస్తాడట. తన జీవితంలో తన అభిమాన హీరో… తాను ప్రేమించిన అమ్మాయి మాత్రం ఉంటే సరిపోతుందని అనుకుంటాడట.

Advertisement

అయితే హీరోయిన్ వాళ్ల తండ్రి ఓ థియేటర్ యజమాని. సినిమా పిచ్చోడికి తన కూతురుని ఇవ్వనని, ఏం పెట్టి పోషిస్తావని అంటాడట. అలాగే తన థియేటర్‌లోకి సాగర్‌ను రానివ్వకుండా చూస్తాడంట. అలాగే.. సాగర్ అభిమానించే హీరో సినిమలను కూడా ఆ థియేటర్‌లో షోలు వేయడంట.

దీంతో సాగర్ సొంతంగా ఎదగి.. హీరోయిన్ తండ్రికి బుద్ది చెప్పాలని అనుకుంటాడు. అలా.. సొంతంగా ఓ థియేటర్ పెడుతాడంట. అందులో తాను అభిమానించే హీరో సినిమాలను మాత్రమే వేస్తాడంట. అలా ఆ థియేటర్ హిట్ అవుతుంది. ఇక చివరగా సాగర్ అభిమానం గురించి తెలుసుకున్న హీరో.. సాగర్ ను స్వయంగా కలవడానికి వాళ్ల గ్రామానికి వస్తాడంట. అలా.. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ స్టోరీ సాగుతుందని తెలుస్తుంది. అయితే ఈ కథలో కొన్ని ట్విస్ట్ పెడుతున్నాడట డైరెక్టర్.

ఆ ట్విస్ట్ లు పక్కన పెడితే… మూవీ కోర్ స్టోరీ మాత్రం అచ్చం సైన్మా షార్ట్ ఫిలిం లా ఉంటుందని తెలుస్తుంది. రెండింట్లో అమ్మాయి ప్రేమ కోసమే. రెండింట్లో సినిమా నేపథ్యంలోనే ఉంటుంది. అలాగే ఈ రెండింట్లో థియేటర్ గురించే ఉంటుందని తెలుస్తుంది. అయితే.. రామ్ సినిమాలో హీరో పాత్ర అనేది యాడ్ చేసి.. కొన్ని ట్విస్ట్ లు పెట్టి ఫుల్ లెన్త్ సినిమాలా మార్చాడంట. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూశాకా… ఈ సైన్మా షార్ట్ ఫిలిం నుంచే స్టోరీ తీసుకున్నాడా… అని ఆడియన్స్ అనే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తుంది.

మరి షార్ట్ ఫిలిం స్టోరీతో వస్తున్న ఈ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. మరి ఆ షార్ట్ ఫిలిం అంత పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుందా ? లేదా షార్ట్ ఫిలిమే కదా అని పక్కన పెట్టేస్తారా…???

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×